– పలు నామినేషన్ల తిరస్కరణ
నవతెలంగాణ-విలేకర్లు
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో స్క్రూట్ని ప్రక్రియ సోమవారం జరిగింది. కాగా నిబంధన ప్రకారం అధికారులు సక్రమంగా లేని కొన్న నామినేషన్లు తిరస్కరిం చారు. భూపాలపల్లి లో 26 మంది అభ్యర్థుల లో ఒక నామినేషన్ చెల్పూర్ శివ కష్ణ యుగ తులసి పార్టీ అభ్యర్థి 25 సంవత్సరాలు లేకపోవడంతో తిరస్కరించరు. భూపాలపల్లి నియోజకవర్గం (108)లో మొత్తం 26 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అందులో యుగ తులసి పార్టీ అభ్యర్థి చెల్పురి శివ కష్ణకు వయస్సు 25 సంవత్సరాల అర్హతకి తక్కువ సంవత్సరాలు ఉన్నందున తిరస్కరించారు. కాగా25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వరంగల్ తూర్పులో 37 నామినేషన్లకు గాను 6తిరస్కరించగా 31 ఆమోదించారు. పరకాలలో 41 నామినేషన్లకు గాను 5 తిరస్కరించగా 36 ఆమోదించారు. జన గామలో 32కు గాను 5తిరస్కరించగా 27ఆమోదించారు. స్టేషన్గన్పూర్లో 28కిగాను 5తిరస్క రించగా 23 ఆమోదించారు. పాలకుర్తి లో 39కి గాను 17 తిర స్కరించగా 22 ఆమోదించారు. నర్సంపేటలో 24 అభ్యర్థులకు గాను 5తిరస్కరించగా 19 ఆమోదించారు. నిబంధనల మేరకు నామినేషన్ల ప్రక్రియ చేపట్టినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.