– జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
మూడు రోజులుగా జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు విస్తారంగా కురిశాయి. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో వర్షాధార పంటపొలాలలో నుంచి మురుగు నీటిని తొలగించి పంటలను రక్షించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ తెలిపారు.
మొక్కజొన్నలి పంట లేత దశలో తేమకు చాలా సున్నితం, అధిక నీటి నిలువను తట్టుకోలేదు కాబట్టి పొలం నుండి మురుగు నీటిని వీలైనంత త్వరగా తీసివేయాలని సూచించారు. ఈ సమయంలో అధిక తేమ వలన భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఉదా రంగులోకి మారే అవకాశం ఉంటుంది. వర్షాలు నిలిచిన తర్వాత రైతులు తమ పంట పొలాలలో 5 గ్రా. 19-19-19 లేదా 20 గ్రా. డీఏపీ మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేయాలన్నారు.
వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత ఎకరాకు 20 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ ను వెసుకోవాలని, తక్కువ కాల పరిమితి గల మొక్కజొన్న రకాలను జులై 31 వరకు విత్తుకోవచ్చని తెలిపారు.
పత్తి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తరువాత ఎకరాకు 25 కిలోల యూరియా, 20 కిలోల పొటాష్‌ను పైపాటుగా 20 రోజుల వయస్సున్న పంటకు మొక్కల మొదళ్ళలో 7-10 సెం. మీ. ధూరంలో పాదులు తీసి ఎరువులను వేసి మట్టితో కప్పవలెనని, పంట త్వరగా కొలుకోవడానికి 19:19:19 లేదా మల్టీ-కె (13-0-45) లేదా 10 గ్రా. యూరియా లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలని అన్నారు. చీడ పీడల ఉధృతి పెరగకుండా 2.5 గ్రా. కార్బెండజిమ్‌ం మాంకోజెబ్ లేదా 2 మీలీ పిఫ్రోనిల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని తెలిపారు.
సోయాచిక్కుడులి పంటలో కాండం కుళ్ళు తెగులు గమనించినట్లైతే 2.5 గ్రా. కార్బెండజిమ్‌ం మాంకోజెబ్ లేదా 2 మీలీ పిఫ్రోనిల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.
వరి ఇప్పటి వరకు నార్లు పోయని రైతాంగం, వర్షాలను సద్వినియోగం చేసుకొని పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్తే పద్దతిలో విత్తుకోవడం వలన సమయం, పెట్టుబడి ఆదా చేసుకోవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి రైతులకు సూచించారు.