Shami : 9 రికార్డులు బద్దలుగొట్టిన షమీ!

నవతెలంగాణ-హైదరాబాద్ : న్యూజిలాండ్‌తో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అత్యద్భుత గణాంకాలు నమోదు చేశాడు. 9.5 ఓవర్లు వేసి 57 పరుగులిచ్చి ఏడు వికెట్లు నేలకూల్చాడు. ఈ దెబ్బతో అతడి ఖాతాలోకి బోల్డన్ని రికార్డులు వచ్చి చేరాయి. అవేంటో చూద్దామా.. * వన్డే ప్రపంచకప్‌లో 50 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్. మొత్తంగా చూసుకుంటే ఏడో బౌలర్. అతడికంటే ముందు గ్లెన్ మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీధరన్, మిచెల్ స్టార్క్, లసిత్ మలింగ, వాసిం అక్రం, ట్రెంట్ బౌల్ట్ ఉన్నారు.
వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన తొలి బౌలర్. కేవలం 17 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. అంతకుముందు మిచెల్ స్టార్క్ ఈ ఘనత సాధించాడు. స్టార్క్ 19 ఇన్నింగ్స్‌లలో 50 వికెట్లు పడగొట్టాడు.
ప్రపంచకప్ నాకౌట్ మ్యాచుల్లో షమీ 48 ఏళ్ల నాటి రికార్డును బద్దలుగొట్టాడు. 1975లో లీడ్స్‌లోని హెడింగ్లీలో జరిగిన ప్రపంచకప్ సెమీస్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు గ్యారీ గిల్మౌర్ 12 ఓవర్లు వేసి 6 మెయిడెన్లు వేసి 14 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడా రికార్డును షమీ తుడిచిపెట్టేశాడు.
వన్డేల్లో షమీ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నెలకొల్పిన ఇండియన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో స్టువార్ట్ బిన్నీ 2014లో మీర్పూర్‌లో బంగ్లాదేశ్‌పై నెలకొల్పిన రికార్డును బద్దలుగొట్టాడు. ఆ మ్యాచ్‌లో బిన్నీ 4.4 ఓవర్లు వేసి రెండు మెయిడెన్లు తీసుకుని 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
ప్రపంచకప్‌లో ఎక్కువసార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి బౌలర్‌గా షమీ రికార్డులకెక్కాడు. నాలుగుసార్లు అతడు ఈ ఘనత సాధించాడు. ఆసీస్ బౌలర్ స్టార్క్ 26 మ్యాచుల్లో మూడుసార్లు ఐదువికెట్లు పడగొట్టాడు.
ప్రపంచకప్ సింగిల్ ఎడిషన్‌లో ఎక్కువసార్లు ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్ కూడా షమీనే. మూడుసార్లు ఐదు వికెట్ల ఘనత సాధించగా, గ్యారీ గిల్మౌర్ (1975), అశాంత డె మెల్ (1983), వాస్‌బెర్ట్ డ్రాక్స్(2003), షాహిద్ ఆఫ్రిది (2011), ముస్తాఫిజుర్ రహ్మాన్ (2019) రెండేసి సార్లు ఐదేసి వికెట్లు పడగొట్టారు.
ప్రపంచకప్‌ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఇండియన్ బౌలర్ షమీనే. 2011లో జహీర్‌ఖాన్‌ 9 మ్యాచుల్లో 21 వికెట్లు పడగొట్టాడు.
న్యూజిలాండ్‌పై అత్యుత్తమ ఫిగర్స్ ఇవే. 2002లో పాక్ పేసర్ షోయబ్ అక్తర్ 9-11-16-6తో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఇప్పుడు దానిని షమీ చెరిపేశాడు.
ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన ఐదో బౌలర్ షమీ. గతంలో గ్లెన్ మెక్‌గ్రాత్, ఆండీ బిచెల్, టిమ్ సౌథీ, విన్‌స్టన్ డేవిస్ ఏడేసి వికెట్లు తీసుకున్నారు.

Spread the love
Latest updates news (2024-05-24 13:07):

low blood sugar strange XL5 behavior | high blood B8y sugar levels lead to | psyllium fiber compatable with PXm blood sugar medication | does estrogen lower Hpn blood sugar | does triamcinolone 8G3 tablet affect blood sugar | WRp blood sugar testing watch | do nasal steroids affect blood Gd0 sugar | chicken and red pepper curry blood sugar diet gkn | can medical marijuana WjD lower blood sugar | how much should my blood sugar go up pYV after eating | how to KwR keep blood sugar from dropping during exercise | high blood sugar at 8 years SFD old | dangerous qBW low blood sugar | can YQv small snacks throughout day lower blood sugar | diabetic coma blood sugar level 3Vj symptoms | does your blood sugar drop faster sVk during pregnancy | Sda 130 blood sugar after meal non diabetic | average blood WAE sugar throughout the day | how does the body get rid of blood DhK sugar | how to rise 5cq blood sugar | if blood sugar is high Dq2 how often should we check | blood sugar level of 97 EPr means | low blood sugar 3AL pregnancy diabetes | can high blood sugar cause crb low body temperature | low blood sugar jJF cranberry juice | low blood sugar monitor fQt watch | how can a type 1 diabetes lower blood sugar FPF | why uex might an emt take repeated blood sugar level measurements | how Sk9 long does blood sugar regulation take | blood ft2 sugar level in arabic | what happens when your d2a blood sugar drops below 30 | random blood sugar z9b test range | no 2Is stick blood sugar testing | 7keto lowers fmx blood sugar | feels like i cOV have low blood sugar | if blood sugar is high will SS2 it lower without medicine | blood sugar level 30 min after dGO eating | how much i6f orange juice for low blood sugar | food aG1 that spike your blood sugar | best stratigy suj daily blood sugar | what is inulin affect zzV blood sugar | is Vd4 75 a good fasting blood sugar | blood sugar after workout y9V | is tatoo to monitor blood sugar sRf accurate | recommended blood sugar levels for people 70 and sL2 older | getting used to testing blood Ojs sugar | blood sugar level 460 after eating oS9 | will water with lemon increase lU1 my blood sugar test results | how to deal with dbS low blood sugar levels | can UG3 you have low blood sugar without diabeties