ఇండియన్ ఐకాన్ అవార్డు అందుకున్న శివరాం మహారాజ్..

నవతెలంగాణ- డిచ్ పల్లి
దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియన్ ఐకాన్ అవార్డు ను సోమవారం ఇందల్ వాయి మండలంలోని దేవి తండాకు చేందిన శివరాం మహారాజ్ కు కేంద్ర కార్మిక శాఖా మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.శివరాం మహారాజ్ గత 14 ఏళ్ళుగా రాష్ట్రంలో బంజారా సమాజం గురించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. దేవి తండా లో అలయ నిర్మాణం కోసం బంజారాలకు రాజకీయంగా ఎదగడానికి రాజగోపురం నిర్మాణం చేపట్టడానికి చేసిన కృషికి ఫలితంగా ఢిల్లీలోని ఇండియన్ ఐకాన్ అవార్డు వారించిందని తెలిపారు . అవార్డు  రావడం సంతోషమని మంచి చేసే వాళ్లకు ఎప్పుడు మంచే జరుగుతుందని, గురువు రామారావు మహారాజ్  చెప్తుండేవారని వివరించారు. ఈ అవార్డును చూస్తేనే నా కృషి మీద నాకు నమ్మకం ఇంకా పెరిగిందని, రాబోయే రోజుల్లో నిజామాబాద్ రూరల్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ కి సిద్ధం అవుతున్నానని, గత ప్రభుత్వాలు రాష్ట్రంలో బంజారా బిడ్డలకు, ఓట్లను చూసి వాడుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు.
Spread the love