తల్లిదండ్రుల కళ్ల ముందే కొడుకులిద్దరూ..షాకింగ్ వీడియో

నవతెలంగాణ-హైదరాబాద్ : తల్లిదండ్రుల కళ్ల ముందే కన్న కొడుకులిద్దరూ మృతి చెందిన విషాద ఘటన ములుగు జిల్లా మంగపేటలో చోటుచేసుకుంది. తమ ఇద్దరు కుమారులతో కలిసి ద్విచక్రవాహనంపై మంగపేటకు బయలుదేరిన మాడవి సురేశ్ దంపతులు.. తెలంగాణ సెంటర్‌ వద్ద బస్టాండు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను టీఎస్‌ఈర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్విటర్‌లో షేర్ చేశారు. డ్రైవింగ్‌ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

Spread the love