విషాదం..రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి

నవతెలంగాణ- వరంగల్ : వరంగల్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్‌ సబ్ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు మృతి చెందాడు. వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారులో గీసుకొండ మండలంలోని హర్జితండా వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గీసుకొండ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన సోమ కుమారస్వామి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. ఆదివారం కారులో వరంగల్ కు వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో అందులో ఉన్న ఎస్‌ఐ కుమారస్వామి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love