అగ్నికి ఆరుగురు ఆహుతి

– సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం
– మిన్నంటిన బాధితుల ఆర్తనాదాలు ొ సెల్‌ఫోన్ల లైట్లతో సంకేతాలు
– బాధితులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ సిబ్బంది
నవతెలంగాణ-బేగంపేట
రూబీ హౌటల్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన మరువక ముందే సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం సంచలనం రేపింది. సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరికొంత మంది ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 7.30గంటల సమయంలో స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ బిల్డింగ్‌ 5,6,7,8వ అంతస్తుల్లో భారీగా మంటలు చెలరేగాయి. దాంతో వ్యాపారులు, సిబ్బంది, కోనుగోలుదారులు, ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలోనే దట్టమైన పొగ అలుముకోవడంతో.. అంతస్తుల్లో చిక్కుకుపోయిన వారు హాహాకారాలు చేశారు. కొంతమంది మెట్ల మార్గంలో భవనంపైకి చేరుకుని రక్షించండంటూ కేకలు వేసారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కాంప్లెక్స్‌లో చిక్కుకున్న 13 మందిని భారీ క్రేన్ల సహాయంతో కిందకు తీసుకొచ్చారు. మంటలను అదుపుచేసేందుకు ఆరు ఫైరింజన్ల సహాయంతో అర్ధరాత్రి వరకు రెస్క్యూ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. మంటల తీవ్రతకు కాంప్లెక్స్‌పైకి చేరుకున్న పలువురు బాధితులు.. తమను రక్షించాలంటూ సెల్‌ఫోన్‌ లైట్లతో సంకేతాలిచ్చారు. వారిని రెస్క్యూ టీం కాపాడింది. అయితే ఈ ఘటనలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు మృతి చెందారు. వారిని ప్రశాంతి, ప్రమీల, శ్రావణి, వెన్నెల, త్రివేణి, శివలు గా గుర్తించారు. ఇంకా కాంప్లెక్స్‌ లోపల చాలా మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. దాదాపు 14 అంతస్తులు గల స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ను 1980లో నిర్మించారు.
ఫోన్లో మాట్లాడుతూ బాధితులకు ధైర్యం చెప్పిన అధికారులు
కాంప్లెక్స్‌లో చిక్కుకున్న వారితో అధికారులు ఫోన్‌ల్లో మాట్లాడారు. భయాందోళన చెందవద్దని వారికి ధైర్యం చెప్పారు. విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. సహాయక చర్యల్లో డీసీపీ చందనాదీప్తీ, ఏసీపీ రమేష్‌, సీఐలు, ఎస్‌ఐలు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
7వ అంతస్తు నుంచి దూకే ప్రయత్నం
కాంప్లెక్స్‌లో చిక్కుకున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఓ వ్యక్తి 7వ అంతస్తు నుంచి సెల్‌ఫోన్‌ లైట్‌ చూపిస్తూ కేబుల్‌ వైర్‌తో దూకేందుకు ప్రయత్నించాడు. అయితే గమనించిన డీసీపీ చందనాదీప్తీ బాధితున్ని దూకొద్దంటూ సూచించారు. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అందరిని రక్షిస్తామంటూ భరోసా ఇచ్చారు. దాంతో బాధితుడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
జీడిమెట్లలోనూ భారీ అగ్నిప్రమాదం
జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి ఫార్మా కెమికల్‌ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూతపడిన ఫార్మా కెమికల్‌ కంపెనీలో మంటలు ఎగిసిపడడం, సాల్వెంట్‌ డ్రమ్‌లు గాల్లోకి ఎగిరిపడడంతో పరిసర ప్రాంతాల వారు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలల్లో విచారణ చేపట్టారు.

Spread the love
Latest updates news (2024-06-12 11:00):

a88 cbd official gummies | platinum series cbd IlH gummies 1000mg | karas orchards cbd gummies V4o holland and barrett | cbd gummies u70 fox news | oros cbd gummies for tinnitus 4Ud | cbd H0N gummies baltimore md | edible gummy bears cbd T2t | thc cbd gummies combo zgC | can you give a puppy cbd gummies MOM | david jeremiah and GKE cbd gummies | free shipping boswellia cbd gummies | cbd sleep gummies hemp rGV bombs | not vjE pot cbd sleep gummies | nature stimulant cbd gummies U8j for ed | ceres cbd anxiety gummies | qVL organixx cbd gummies reviews | flavored cbd gummies most effective | organix anxiety cbd gummies | shop cbd relax gummies N1O | cbd gummies eagle hemp cbd cEl | cbd official gummy cubes | cbd e97 gummies fun drops | Lvg exhale well cbd gummies | ctY cbd gummies thc content | buy cbd gummies online us gXk | keoni cbd gummies near me erE | cbd gummies melatonin online sale | cbd gummies review qGA for quitting smoking | cbd oil gummy chews cbd | where can gRg i buy jolly cbd gummies | cbd gummy online shop blog | cbd big sale products gummies | NYQ cbd gummies fort wayne | cv sciences jw5 cbd gummies calm | cbd FzG gummies with thc online | where to buy SJ9 keoni cbd gummies near me | sugar free cbd 7Vd gummy worms | will cbd gummies help you stop smoking aBT | nrL cbd gummies cause weight gain | cbd gummies for ABB anxiety for sale | gummy hON brand cbd pure hemp 500mg ingredients | chronic pain vmm cbd gummies for pain | bio lyfe cbd gummies male Dw8 enhancement | when to f8b take a cbd gummie before bed | RXP cbd living gummies sour | can 9 mg cbd gummies Lcj get you high | plant organix cbd gummies nxb | cbd mRV gummies half life | melatonin and pIi cbd gummies | can you take cbd gummies with kidney disease Vqx