నవతెలంగాణ – హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ ఇమాంగూడకు చెందిన శివ(29) సాఫ్ట్వేర్ ఉద్యోగి. చైతన్యపురిలోని సెలబ్రిటీ హోటల్లో సోమవారం రాత్రి గది అద్దెకు తీసుకున్నాడు. మంగళవారం ఉదయం హోటల్ సిబ్బంది చూసేసరికి, ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. హోటల్ నిర్వాహకుల సమాచారం మేరకు పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు విషయం తెలియజేశారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి అన్న రాఘవేంద్ర గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.