నీతికి, నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం సుందరయ్య జీవితం

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
నీతికి, నిజాయతీకి, నిడారంబర జీవితానికి నిలువెత్తు నిదర్శనం పుచ్చలపల్లి సుందరయ్య జీవితం అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్‌లో పీడిత ప్రజల ప్రియతమ నేత పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా అలగానిపాడు గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించిన సుందరయ్య తన జీవితాంతం తాడిత, పీడిత, పేద ప్రజల విముక్తి కోసం పనిచేసిన మహానేత అని కొనియాడారు.తన తండ్రి ద్వారా వచ్చిన వందలాది ఎకరాల భూమిని భూమిలేని దళిత పేదలకు పంచి ఇచ్చిన ఘనత సుందరయ్యకే దక్కిందన్నారు.దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని సుందరయ్య నిర్మించాలని గుర్తు చేశారు.1934వ సంవత్సరంలో తన సొంత గ్రామంలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి చలించి వారి కోసం పోరాడేందుకు ఏపీ వ్యవసాయకార్మిక సంఘాన్ని నాడు స్థాపించారని నేడు ఆ సంఘం దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో విస్తరించిందన్నారు.తరతరాలుగా వస్తున్న ఫ్యూడల్‌ భావాజాలానికి వ్యతిరేకంగా దళితుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.కుల వివక్షకు వ్యతిరేకంగా పేదల్ని కలుపుకొని అనేక పోరాటాలు నిర్వహించారన్నారు.ఈ దేశంలో ఉన్న ఆర్థికఅసమానతలు పోవాలంటే పేదలందరికీ భూమి దక్కాలని తద్వారా పేదలకు ఆర్థిక స్వాతంత్య్రం వస్తుందని ఆనాడే చెప్పారని పేర్కొన్నారు. దేశంలో తొలి ప్రతిపక్ష నేతగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలి ప్రతిపక్ష నేతగా పనిచేసిన ఘనత సుందరయ్యకే దక్కిందన్నారు. పార్లమెంట్‌, అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ సైకిల్‌పై వెళ్లేవాడని, తన జీవితాంతం నిడారంబర జీవితాన్ని గడిపిన మహా నాయకుడని కొనియాడారు.దివిసీమలో ఉప్పెన వచ్చిన సందర్భంగా పార్టీ కేడర్‌ను దించి అనేక సేవా కార్యక్రమాలు చేశారని చెప్పారు.పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శిగా చాలాకాలం పాటు పనిచేసి దేశంలో రాష్ట్రంలో పార్టీ విస్తరణలో కీలకపాత్ర నిర్వహించారని తెలిపారు.అనేకమంది కార్యకర్తలను, నాయకులను సుందరయ్య తయారు చేశారని పేర్కొన్నారు.నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా చేసుకొని ఆశయ సాధన కోసం కషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, కోటగోపి, జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్‌, జిల్లేపల్లి నర్సింహారావు, ధనియాకుల శ్రీకాంత్‌, మేకనబోయిన శేఖర్‌, వీరబోయిన రవి ,చిన్నపంగనర్సయ్య, కొప్పుల రజిత, మేకనబోయిన సైదమ్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాంబ ాబు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా నాయకులు వల్లపుదాసు సాయికుమార్‌, మామిడి సుందరయ్య, రణపంగ కష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు వినోద్‌నాయక్‌, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా నాయకులు బచ్చలకూర రామ్‌చరణ్‌, పాముల సీతారాములు, ప్రజాకళాకారులు పిండిగా గోపి తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి సీపీఐ(ఎం) టౌన్‌ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్యనగర్‌లో ఆ పార్టీ జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు కోటగోపి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సుందరయ్యనగర్‌ శాఖ కార్యదర్శి ముకర్ల వెంకన్న, శాఖా సభ్యులు లక్ష్మమ్మ, రంగమ్మ, అనసూయమ్మ, వెంకన్న, ఫిలిప్‌, సోమయ్య,చరణ్‌, హర్షిత్‌ తదితరులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల :భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ ప్రసిద్ధ నేతల్లో పుచ్చలపల్లి సుందరయ్య ఒకరని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్‌రావు అన్నారు.శుక్రవారం నేరేడుచర్లలోని అరిబండిభవన్‌లో నిర్వహించిన పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రీకత ప్రజాస్వామ్యసూత్రాల ప్రాతిపదికన కమ్యూనిస్టు పార్టీని నిర్మించాల్సిన అవసరాన్ని గుర్తించిన మొదటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య అన్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్‌, కుంకు తిరుపతయ్య, నీలా. రామ్మూర్తి,వరలక్ష్మీ,రుద్రమ్మ, పాతూరి శ్రీనివాసరావు, ముశం నర్సింహ, గుర్రంఏసు, బోల్లేపల్లి శ్రీను, పటాన్‌ జానీ తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి: నేటితరం యువకులకు,రాజకీయ నేతలకు,పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు.పుచ్చలపల్లి సుందరయ్యవర్థంతిని పురస్కరించుకొని మండలకేంద్రంలోని వీఎన్‌ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండలకార్యదర్శి బుర్రశ్రీనివాస్‌,తాటి విజయమ్మ,ముత్తయ్య,రమేష్‌, మడిపెద్ది యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
చివ్వెంల : పుచ్చలపల్లి సుందరయ్య అడుగుజాడల్లో నడవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. మండలకేంద్రంలో సుందరయ్య చిత్రపటానికి ఆ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏసోబు, మండల కార్యదర్శి బచ్చలకూర రామ్‌చరణ్‌ ,నాయకులు సులోమాన్‌, కన్నయ్య, స్టాలిన్‌, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌టౌన్‌ :సుందరయ్య జీవితమే ఓ విప్లవ సందేశమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగారపు పాండు అన్నారు.సుందరయ్య 38వ వర్థంతిని స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు శీలం శ్రీను, తుమ్మకొమ్మయోన, రేపాకుల మురళి, చిన్నం వీరమల్లు, కౌన్సిలర్‌ ఇందిరాల త్రివేణి, పార్టీ సీనియర్‌ నాయకులు పిట్టల నాగేశ్వరరావు, పాశం వెంకటనారాయణ, తురక వీరయ్య,పట్టణ కమిటీ సభ్యులు శీలం సాంబయ్య,శీలంవెంకన్న, ఎలక సోమయ్యగౌడ్‌,రేపాకుల వీరస్వామి,గణపవరపు శ్రీను, చింతకాయల పర్వతాలు,పాశం వీరబాబు,ముషిని శంభయ్య,కోలా సైదులు,శంభయ్య తదితరులు పాల్గొన్నారు.
మఠంపల్లి: దేశంలోనే గొప్పనేత పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఐ (ఎం) జిల్లాకార్యదర్శి వర్గసభ్యుడు ధీరావత్‌ రవినాయక్‌ అన్నారు. మండలకేంద్రంలోని ఆ పార్టీ కార్యాల యంలో సుందరయ్య 38వ వర్థంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పాండునాయక్‌, మండల కార్యదర్శి మాలోత్‌ బాలునాయక్‌, సీనియర్‌ నాయకులు ఎస్‌.జగ న్మోహన్‌రెడ్డి, మండల కమిటీ సభ్యులు కంటుకోటయ్య, జాల తిరుపతయ్య, వినోద్‌, సాంబయ్య,తదితరులు పాల్గొన్నారు.
మునగాల: భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత, పేదల పెన్నిధి సుందరయ్య పార్టీ, ప్రజాసంఘాలకు చేసిన సేవలు మరువలేనివని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు, మేదరమెట్ల వెంకటేశ్వరరావుఅన్నారు.మండలకేంద్రంలో సీపీఐ(ఎం) కార్యాలయంలో చందా చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు.ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దేవరం వెంకట్‌రెడ్డి, మండల కార్యదర్శి చందాచంద్రయ్య,పార్టీ మండల కమిటీ సభ్యులు బచ్చలకూరస్వరాజ్యం,వీరబోయిన వెంకన్న, ఎస్‌కె.సైదా, దేశిరెడ్డి స్టాలిన్‌రెడ్డి, టి.సతీష్‌,ఆర్‌.రమేష్‌,శాఖ కార్య దర్శులు మల్లారెడ్డి, శివ, పాల్గొన్నారు.
అర్వపల్లి : మండలకేంద్రంలో సుందరయ్య చిత్రపటానికి సీపీఐ(ఎం) మండలకార్యదర్శి వజ్జె శ్రీనివాస్‌ పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు చెరుకు ఏకలక్ష్మి, మండలనాయకులు వజ్జె వినరుయాదవ్‌,వజ్జె సైదయ్య, దేవరకొండ బాలయ్య, జమడగుంట్ల కష్ణయ్య, ఎంసీపీఐయూ నాయకులు ఈదుర వీరపాపయ్య, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మోతె: నేటి యువత పుచ్చలపల్లి సుందరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. మండలకేంద్రంలో సుందరయ్య 38వ వర్థంతిని పార్టీ మండలకమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కిన్నెర పోతయ్య,లింగయ్య,ఆర్‌.వెంకన్న, ఉప్పలమ్మ,వెంకటమ్మ, మల్లమ్మ పాల్గొన్నారు.

Spread the love