జిల్లా దేవాంగ విద్యా కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు అందజేత

నవతెలంగాణ- ఆర్మూర్ :  జిల్లా దేవాంగ విద్య కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 21 పదవ తరగతి 20వ జిల్లా స్థాయి ప్రతిభ పురస్కార అవార్డులు అందజేస్తున్నట్లు దేవాంగ విద్యా కమిటీ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ తిరుమల గార్డెన్ యందు జరుగు ఈ కార్యక్రమానికి సభ్యులందరూ సకాలంలో హాజరై విజయవంతం చేయాలని కోరినారు.