నవతెలంగాణ – హైదరాబాద్: టీఎస్ టెట్ హాల్టికెట్లు నేడు విడుదల కానున్నాయి. నేటి నుంచి అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లను పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచనున్నది. ఈనెల 15న టెట్ పరీక్ష జరుగునుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలను ఈ నెల 27న వెల్లడించనున్నారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://tstet.cgg.gov.in లో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదుచేసి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.