శ్రీవిష్ణు, రెబ్బా మోనికాజాన్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన చిత్రం ‘సామజవరగమన’. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో హీరోయిన్ రెబ్బా మోనికాజాన్ మీడియాతో మాట్లాడుతూ, ‘మలయాళంలో చేసిన సినిమాల్లో ‘ఫొరెన్సిక్’కి మంచి పేరు వచ్చింది. తెలుగులో రిలీజైన నా తొలి చిత్రం ‘సామజవరగమన’. ‘బ్రో’ సినిమా లుక్ టేస్ట్‌కు వచ్చిన నేను నిర్మాత రాజేష్‌ని కలిశాను. దర్శకుడు రామ్ అబ్బరాజు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించా. ‘బ్రో’ వంటి పెద్ద సినిమాలో చేయకపోయినా ‘సామజవరగమనా’ వంటి మంచి
సినిమాలో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. శ్రీ విష్ణు సినిమాతో పరిచయం కావడం ఒక గౌరవంగా భావిస్తున్నా. అల్లు అర్జున్‌తోపాటు చాలా మంది ప్రముఖులు నేను చేసిన సరయు పాత్రను మెచ్చుకుని, ట్వీట్స్ ద్వారా ప్రశంసించారు. దళపతి విజరు సినిమాలో నటించాలనే కోరిక ‘బిగిల్’ సినిమాతో తీరింది. కథలో ఇంపార్టెన్స్ ఉంటే తెలుగులో కూడా ఎలాంటి పాత్రలైనా చేస్తాను. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయనతో పని చేసే ఛాన్స్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను’ అని తెలిపారు.