దేశ గౌరవం కోసం
క్రీడావనిలో వేగుచుక్క అయింది
అకుంఠిత దీక్షతో సాధన చేసింది
ప్రపంచ పట శిఖరాగ్రానికి
దేశపు మువ్వన్నెల జెండాని ఎగరేయాలనుకుంది
కామాంధుల కుట్రకు బలై ఎదురు నిలిచింది
దేహమున్న ఆటబొమ్మని కాదు పొమ్మంది
పోరాటం నాకు ఉగ్గుపాల విద్య
ఆత్మాభిమానం నా ఆయుధం
గెలుపే నా భవితం సాధనే నా ఆయువు
పోరాటమే నా ఊపిరంటూ
కాలానికి ఎదురు నిలిచిన ధీర
ఈనాడు ఆమె దేహ బరువు
వంద గ్రాములెక్కువని ద్వేషపు బరువు
దేశ పటాన్ని అవనతం చేసింది
క్రీడా స్ఫూర్తి మోసపు వలకు చిక్కుకుంది
స్వార్థపరుల కుటిల నీతికి
దేశపరువు పాతాళాన్నంటింది
ఇప్పుడు ఆటలో గెలవకున్నా
ఆమె ఏనాడో విజేత అయింది
భారత ప్రజల హదయాలు గెలిచింది
గోడకు కొట్టిన ంతిలా ఆమె వెనుదిరుగుతుంది
పడి లేచిన కెరటం అలలపై
తేలినట్లు పైకెగురుతుంది
పోరాటమే శ్వాసగా నిలిపి
రేపు విశ్వ విజేత అవుతుందామె..!
– రోహిణి వంజారి, 9000594630