Southwest Airlines plane heading from Houston to Cancun catches fire mid air. pic.twitter.com/GAtFXXPcbO
— Ronald John (@rontech777) August 17, 2023
నవతెలంగాణ – హైదరాబాద్
విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇంజిన్‌లో మంటలు చెలరేగినప్పటికీ సిబ్బంది ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం టెక్సాస్‌లోని హాబీ విమానాశ్రయం నుంచి మెక్సికోలోని కాన్‌కన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలు దేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజిన్‌నుంచి మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని టేకాఫ్ అయిన 30 నిమిషాల వ్యవధిలోనే హాబీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం నుంచి మంటలు వస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.