దుక్కులు దున్నే బిజీలో రైతులు
రోహిణి కార్తీ లో విత్తనాలు వేయడం షురూ
ముందుగానే వర్షాలు కురవడం సంతోషదాయకం: ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి మల్లేష్
నవతెలంగాణ-యాచారం
వరుసగా కురుస్తున్న తొలకరి చినుకులతో రైతులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం యాచారం మండల పరిధిలోని తక్కళ్లపల్లి లో రైతులంతా దుక్కులు దున్నే బీజీలో కనిపించారు. రోహిణి కార్తీ ప్రారంభంలో రైతులంతా విత్తనాలు చల్లే పనిలో నిమగమయ్యారు. స్వయంగా ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి మల్లేష్ తన పొలంలో రైతుగా మారి దూక్కి దున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగానే తొలకరి జల్లులు కురవడం సంతోషకరమైన విషయమన్నారు. రైతులంతా ముందుగానే తన పొలాలను చదును చేసి విత్తనం చల్లడానికి పనులు పూర్తి చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న ప్రోత్సాహంతో రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులంతా ముందుగానే వ్యవసాయ పొలాన్ని చదును చేయాలని ఆయన సూచించారు.