పెండ్లి అయిన మరుసటి రోజే హైదరాబాద్ వధువుకు ప్రసవం…

నవతెలంగాణ – హైదరాబాద్
పెండ్లి అయిన మరుసటి రోజే వధువు ప్రసవించడంతో అందరూ షాక్ కు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ కు చెందని మహిళకు గ్రేటర్ నోయిడాలోని ఒక వ్యక్తితో ఈ నెల 26న పెండ్లి జరిగింది. పెండ్లి అయిన రాత్రి ఆమెకు కడుపు నొప్పి వచ్చింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు చెప్పిన వియయం విని పెండ్లి కొడుకుకు కళ్లు బైర్లు కమ్మినంత పనైంది. ఆమె గర్భవతి అని వైద్యులు చెప్పారు. ఆ మరుపటి రోజే వధువు ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. వాస్తవానికి పెండ్లికి ముందే పెండ్లి కొడుకు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పెండ్లికూతురు పొట్ట కొంచెం పెద్దగా ఉండటంతో… అదే విషయంపై వధువు కుటుంబ సభ్యులను వారు ప్రశ్నించారు. అయితే, పొట్టలో రాళ్లు తీయించుకోడానికి ఆపరేషన్ చేయించుకుందని… అందుకే కడుపు కొంచెం వాపుగా కనిపిస్తోందని చెప్పారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందిన వరుడి కుటుంబ సభ్యలు పెండ్లికి అభ్యంతర పెట్టలేదు. మరోవైపు తమ కూతురు గర్భవతి అనే సంగతి ఆమె తల్లిదండ్రులకు అప్పటికే తెలుసు. అయితే, ఆ విషయాన్ని వారు దాచిపెట్టారు. వధువు ప్రసవించడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఆమెను కోడలిగా స్వీకరించేందుకు వరుడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో నోయిడా నుంచి ఆమెను ఆమె తల్లిదండ్రులు సికింద్రాబాద్ కు తీసుకొచ్చారు.

Spread the love