![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG_20230830_152521.jpg)
మండల వ్యాప్తంగా రాఖీ పండుగ సందర్భంగా ఆడపడుచుల రాఖీల సందడి బుధవారం స్పష్టంగా కనబడుతుంది. తమ సోదరులకు కట్టే రాఖీల కొనుగోలు మరియు స్వీట్ల కొనుగోలు విషయంలో రాఖీ విక్రయ దుకాణాలు రోజంతా సందడిగా కనిపిస్తున్నాయి. అంతేకాక పొరుగు ఊర్లో ఉన్న తల్లిగారింటికి అన్న తమ్ముళ్ల వద్దకు చేరుకునేందుకు బుధవారం ఆడపడుచుల ప్రయాణాలతో ప్రయాణ ప్రాంగణాలు సందడిగా కనిపించాయి. పిల్ల పాపలతో ప్రయాణాలు కష్టం అయిన పండగ అన్నదమ్ముల ప్రేమతో ప్రయాణిస్తున్నామని మహిళ సోదరీమణులు తెలుపుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి రాఖీ విక్రయాలు బేరాలు మంచిగా సాగాయని వ్యాపారాలు తెలుపుతున్నారు. స్వీట్ హౌస్ వ్యాపారులు కూడా రాఖీ పండగ సందర్భంగా సంతోషంగా విక్రయాలు సాగుతున్నట్లు కనిపించారు.