కాంగ్రెస్ వీడు తున్న ప్రముకులు…

– బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ టికెట్ ఆశావాహులు..

నవతెలంగాణ- అశ్వారావుపేట: ఎన్నికలు ప్రక్రియ గడువు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ లోంచి ప్రతి పక్షంలో  ఇతర పార్టీల నుండి అధికార పక్షం లోకి నాయకులు వారసులు అధికం అవుతున్నాయి.
ఎపుడు?ఎవరు? ఏ కండువాతో దర్శనం ఇస్తారో అయోమయ స్థితి నెలకొంది అన్ని పార్టీల శ్రేణుల్లో ను టికెట్ లు కేటాయింపు తంతు ముగియడంతో ఆశావాహులు అందులో నుండి ఇందులోకి,ఇందులో నుండి అందులో కి దూకేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ మూడో జాబితా ప్రకటించిన రోజే మాజీ ఎమ్మెల్యే, టిపీసీసీ కార్యదర్శి హోదా ఉన్న తాటి వెంకటేశ్వర్లు పార్టీ పై ఆరోపణలు చేస్తూ,నాయకులు పై విమర్శలు గుప్పించి బీఆర్ఎస్ చేరుతున్నట్లు ప్రకటించారు. టిపీసీసీ మహిళా విభాగం నాయకురాలు, ములకలపల్లి జెడ్.పి.టి.సి సున్నం నాగమణి తనకు సీటు రానందుకు బోరున విలపించింది.కాంగ్రెస్ కు రెబల్ గా సున్న నాగమణి నామినేషన్ సైతం దాఖలు చేసారు. ఏది ఏమైనా ఈసారి రాజీ పడేది లేదని చెప్పిన ఆమె 48 గంటలు గడవకముందే ఎం.పి వద్దిరాజు రవిచంద్ర, స్థానిక బీఆర్ఎస్ అధికార ప్రతినిధి యు.ఎస్ ప్రకాశ్ తో కలిసి హైద్రాబాద్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో పోవడంతో బీఆర్ఎస్ లో చేరిపోయారు. గులాబీ గూటికి చేరిన భట్టి, పొంగులేటి అనుచరులు: మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన కొండూరి సుధాకర్, సున్నం నాగమణి. కాంగ్రెస్ పార్టీకి రోజుకో షాక్ తగులుతోంది.ఆ పార్టీ ముఖ్య నేతలు వరుసగా కారు ఎక్కుతుండటం‌తో కాంగ్రెస్ క్యాడర్ గందరగోళానికి గురవుతున్నారు. శుక్రవారం మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, ఓయూ విద్యార్థి జేఏసీ నేత మానవతా రాయ్ లు బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,పొంగులేటి శ్రీనివాసరెడ్డి లకు తాజాగా మరో షాక్ తగిలింది.భట్టి ప్రధాన అనుచరురాలు, ములకలపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు సున్నం నాగమణి,పొంగులేటి ముఖ్య అనుచరుడు కొండూరి సుధాకర్ లు శనివారం ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.వీరికి రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దగ్గరుండి మరీ కేటీఆర్ చేత పార్టీ కండువాలు కప్పించారు. సీఎల్పీ నేత భట్టి తన వర్గం నుంచి సున్నం నాగమణి కి అశ్వారావుపేట కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు.మరో వైపు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని, సత్తుపల్లి అసెంబ్లీ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ లో చేరిన కొండూరి సుధాకర్ పేరును ఆయన నమ్ముకున్న నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏఐసిసి పరిశీలన దాకా తీసుకెళ్లారు.కానీ ఈ ఇద్దరు నేతలు తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకోలేక పోయారు.తమ నేతలు టికెట్ పేరుతో తమను వాడుకుని వదిలేశారని ఆరోపిస్తూ ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయించారు. గులాబీ పార్టీ తోనే తమ రాజకీయ భవిష్యత్తు కొనసాగుతుందని ప్రకటిస్తూ యువనేత కేటీఆర్ చేత కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రోజుకో నేత  పార్టీ వీడుతుండడం తో ఆ పార్టీ క్యాడర్ నైరాశ్యానికి గురవుతున్నారు. ఇంకా ముందు ముందు ఎన్ని షాకులు తగులుతాయో అని ఆ పార్టీ నేతలు బెంబేలెత్తుతున్నారు.
Spread the love