తాగునీరందక అల్లాడుతున్న పేదలు

తాగునీటి పండుగ ఎవరికోసం
ఎంసీపీఐ(యూ) నాయకులు
నవతెలంగాణ-మియాపూర్‌
పేదలకు తాగునీరందక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, తాగునీటి పండుగ ఎవరి కోసమని ఎంసీపీఐ(యూ) నాయకులు నిలదీశారు. సోమవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మియాపూర్‌ డివిజన్‌ లో మెట్రో స్టేషన్‌ పక్కన ఉన్న ఓంకార్‌ నగర్‌లో 800 కుటుంబాలు బడుగు, బలహీన వర్గాలకు నేటికీ తాగునీటి సమస్య తీరలేదన్నారు. ఆధునిక ప్రపంచంలో ఉన్న అనాగరికంగా గుంతలు, ఊట చలిమలు తొవ్వుకుని,నీళ్లు చేదుకుంటున్నారని తెలిపారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన మంచినీళ్ల పండుగ ఎవ్వరికోసమని నిలదీశారు. ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు లాక్కోడానికేనా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) డివిజన్‌ నాయకులు శివాని రజియా, లలిత బస్తీ వాసులు ఇసాక్‌, జంగయ్య, కోటయ్య, గాలయ్యా, ఎల్లమ్మ, అనిత పాల్గొన్నారు.