జీవితానికి – సముద్రం మరో పార్శ్వం.!!

కలలు లేకపోతే జీవితం లేదు
అలలు లేకపోతే సముద్రమే లేదు
అవును జీవితమెప్పుడూ ఉప్పు సముద్రమే.
ఎన్ని నదుల్ని కలుపుకుంటుందో ఆ సంద్రం
కడలి అసంతప్తికి సంకేతం
కడవరకూ అంతే కదా మన జీవితం
తప్తిపడితే ఆరాటం ఉండదు
జీవనపోరాటమూ లేదు.
కఠిన తుపాను వచ్చినప్పుడే
ఓడ సరంగు సత్తా తెలిసేది
ఆటుపోటులు ఎదుర్కొంటే కదా
జీవిత సత్యమూ తెలిసొచ్చేదీ.
అసలు సముద్రం ప్రశాంతంగా ఉంటే
ఓడ ఎందుకు
కష్టనష్టాలు ఎదురైనప్పుడే కదా
సాగాలి మును ముందుకు.
సముద్రాన్ని దాటాలంటే
ఆలోచన కూడదు – పడవ కావాలి.
వివేచనతో కూడిన ఈత రావాలి.
ఆశ – మనిషికి ఊత… ఈత… ఓడ!
కడలి గర్భంలో తిమింగలమూ ఉంటుంది
ముత్యమూ ఉంటుంది.
జీవన మార్గం ఆస్వాదించాలే గానీ
ఈ సత్యం నిత్యకత్యమే కదా!?.
అందుకే సముద్రమెప్పుడూ నాకు స్ఫూర్తి
విరిగిపడ్డ కెరటమూ ఆదర్శం – నా మార్గదర్శి.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి,

8008 577 834