మౌనం మాట్లాడింది

మణిపూర్‌పై దేశం భగ్గుమన్నాక
పార్లమెంట్‌ మౌనం మాట్లాడింది
దొంగలు పడిన ఆర్నెల్లకు
కుక్కలు లేచి మొరిగినట్టు

తెల్లవారు ఝామున కూయాల్సిన
మణిపూర్‌ పాలక కోడీ కూసింది
బారెడు పొద్దు ముఖం మీద పడ్డాక
మే దురాగతంపై కాదు, ట్విట్టర్‌పై కోపంతో

మొన్నటి గుజరాత్‌ నిన్నటి కాశ్మీరుల్లో
రాజేసిన ఉన్మాదపు కాష్టం
నేడు మణిపూర్ని తగలేసింది
రేపు.. దేశమో.. మైనార్టీలో కావచ్చు

దిగ్గున లేచిన దేశానికి దణ్ణం పెట్టారు
పడమటి పొద్దుపొడుపు చూడమన్నారు
నిందుతుడు హరిదాస్‌ అబ్దుల్లా అయ్యాడు
ఇప్పుడందరూ చప్పట్లు కొట్టండంటారేమో
– వివి