ఆర్డర్ కాపీ వచ్చేదాకా.. సమ్మె ఆపేదేలే

నవతెలంగాణ -నవీపేట్: గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ ఆర్డర్ జీవో వచ్చేదాకా సమ్మె ఆపేదేలే అంటూ నవీపేట్ మండల కేంద్రంలో పంచాయతీ సిబ్బంది శనివారం 17వ రోజు సమ్మెను కొనసాగించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు మరియు సమ్మె డిమాండ్ల ను పరిష్కరించే దాకా సమ్మెను విరమించబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు లక్క గంగారం, నరేష్, ప్రేమ్ లాల్ మరియు కార్మికుల పాల్గొన్నారు.