అంచనాలు పెంచిన ట్రైలర్‌

మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ బ్యానర్స్‌పై సుభాస్కరన్‌, మణిరత్నం నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’. గత ఏడాది విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని, బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్స్‌ రాబట్టిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ చిత్రానికి ఇది కొనసాగింపు. చోళుల గురించి తెలియజేసే సినిమా ఇది. అత్యద్బుతమైన విజువల్స్‌తో లార్జర్‌ దేన్‌ లైఫ్‌ మూవీగా దీన్ని మణిరత్నం సిల్వర్‌ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే దీనిపై ఇప్పటికే హై ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచేలా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఐశ్వర్యా రాయ్‌, విక్రమ్‌, జయం రవి, కార్తి, త్రిష కృష్ణన్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రంలో శరత్‌ కుమార్‌, ప్రభు, లాల్‌, కిషోర్‌, అశ్విన్‌ కాకమాను, ఐశ్వర్య లక్ష్మి ఇతర పాత్రల్లో నటించారు. చెన్నైలో పొన్నియిన్‌ సెల్వన్‌2 ట్రైలర్‌తో పాటు ఆడియో లాంచ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిత్రయూనిట్‌తోపాటు పలువురు తమిళ చిత్ర ప్రముఖులు సైతం ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఏప్రిల్‌ 28న వరల్డ్‌వైడ్‌గా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు.

Spread the love