నా మనసు నాతో ఆడే ఆటలో
నేను దోషిని
నిజం చెప్పలేను అబద్ధం దాచలేను
నిశబ్దంగా మారణహోమానికి
నాంది పలకాలి
లేకపోతే నీకు నువ్వే శత్రువు
నిజంతో నిర్భయంగా పోరాటం చేయి
కాలం తలవంచి నడుస్తుంది నీతో
నికష్టమైన ఆలోచనలతో
నివురుగప్పిన గుండెలతో
మానవ రూపంలో
తిరిగే మగాలను సంహరించి
దేశాన్ని కాపాడటం
మన అందరి బాధ్యత
ఇప్పటికైనా మేలుకో
బంధాలను మరిచి
బలిపశువులుగా మార్చుతున్న
ఈలోకం తీరును మార్చి చూపించు.
– మేరెడ్డి రేఖ, 7396125909