రెంజల్ మండల కేంద్రంలో బీజేపీలో భారీగా చేరిన యువత..

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి సమక్షంలో రెంజల్ పాలకవర్గ సభ్యురాలు కనకమ్మ తో పాటు, సుమారు 30 మంది యువత బీజేపీ కండువను కప్పుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారు బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు వారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గోపికృష్ణ, ఎంపీపీ రజిని కిషోర్, మండల ఉపాధ్యక్షులు ఖ్యాతం యోగేష్, మండల మాజీ అధ్యక్షులు మేక సంతోష్, మాజీ మండల అధ్యక్షులు చుక్క రాజు గౌడ్, తిరుపతి హనుమాన్లు (బుజ్జి) బీజేవైఎం మండల అధ్యక్షుడు ప్రకాష్, తదితరులు ఉన్నారు.