అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ సీజ్‌..

నవతెలంగాణ – వేములవాడ
అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను బుధవారం సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా మైనింగ్‌ ఏడీ సైదులు సీజ్‌ చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ అర్బన్‌ మండలం అగ్రహారం గుట్ట ప్రాంతం నుండి టిప్పర్‌లో అక్రమంగా మట్టిని తరలిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వెంటనే స్పందించి మట్టి తరలిస్తున్న ప్రాంతానికి చేరుకొని టిప్పర్‌ను సీజ్‌ చేసి సమీపంలోని బస్‌ డిపోకు తరలించినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడి నుండి అయిన అక్రమంగా మట్టి తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

Spread the love