నవతెలంగాణ నూతనకల్: మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బిక్కీ బుచ్చయ్య గౌడ్ నవ తెలంగాణ నూతనకల్, తుంగతుర్తి శాసనసభ సభ్యుడిగా బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ నేడు మండల పరిధిలోని చిలపకుంట్ల ఎడవెల్లి సోమల తండా బక్క హేమలతండ టీక్య తండా తళ్ళాసింగారం ఎర్ర పహాడ్ వెంకెపెళ్లి గ్రామాలలో నిర్వహించే ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేయాలని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బిక్కీ బుచ్చయ్య గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. నియోజకవర్గం లో గత పాలకుల కాలంలో ఎడారిగా ఉన్న భూములను గోదావరి జలాల ద్వారా సస్యశ్యామలం చేసిన శాసనసభ సభ్యులు కిషోర్ కుమార్ ని వరుసగా మూడవసారి కూడా గెలిపించి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను చేసే బాధ్యత నియోజకవర్గ ప్రజలకు ఉన్నదని వారన్నారు కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ ఫలితాలే రానున్న ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అన్నారు. ఇట్టి ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ అభిమానులు నాయకులు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.