న్యాయ పోరాటానికి దిగిన టాలీవుడ్ హీరోయిన్..

నవతెలంగాణ-హైదరాబాద్ : ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే- హీరోయిన్ డింపుల్ హయతి పార్కింగ్ వివాదం ముదురుతోన్న సంగతి తెలిసిందే. ఉదయాన్నే హాట్ టాపిక్ గా వెలుగులోకి వచ్చిన మ్యాటర్ అంతకంతకు హీటెక్కుతుంది. డింపుల్ పై కేసు నమోదు కావడం.. సమన్లు జారీ కావడం.. చర్చలకు రావాలని పిలవడం వంటి సన్నివేశాలు వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తున్నాయి. తప్పంతా డింపుల్ తో అన్నట్లు మీడియాలో ఫోకస్ అవుతుంది. దీనిపై ఇప్పటికే రాహుల్…డింపుల్ ఎవరికి వారు సంక్షిప్త వివరణ ఇచ్చారు. తాజాగా ఈ కేసులో కొత్త కారణాలు తెరపైకి వస్తున్నాయి. డింపుల్ న్యాయ పోరాటానికి దిగింది. తన తప్పు లేనప్పుడు! స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం తనకేముంది? అన్న వాదన తెరపైకి వస్తుంది. తనపై ఫిర్యాదు చేసిన డ్రైవర్ చేతన్ పై తిరిగి కేసు పెట్టే ప్రయత్నం చేసింది. అయితే ఆమె ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు. దీంతో ఆమె తీవ్ర అసహానాన్ని వ్యక్తం చేసింది. నాపై కక్ష సాధింపుతోనే కేసు పెట్టారని ఆరోపించింది. నన్ను ఇబ్బంది పెట్టాలనే చలానాలు వేస్తున్నారని ఆరోపించింది. ట్రాపిక్ డీసీపి డ్రైవర్ డింపుల్ కారు పార్కింగ్ లో తన కారుకి రాళ్లు అడ్డు పెట్టేవారని.. అందువల్ల వాహనం బయటకు తీసినప్పుడల్లా ఇబ్బంది పడేల్సి వచ్చేదని..ఆ విషయం బహుశా డీసీపీకి తెలియకపోవచ్చు! అన్న విషయాన్ని డింపుల్ బయటకు తెస్తుంది. అంతకు ముందు పోలీస్ అధికారి పార్కింగ్ లో డింపుల్ అక్రమంగా తన కారును పార్క్ చేసేదని డ్రైవర్ ఆరోపించారు. ఇలా ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో వివాదం మరింత ముదురుతున్నట్లు కనిపిస్తుంది. డింపుల్ న్యాయ పోరాటాని సై అన్న నేపథ్యంలో వివాదం ఇంకెత దూరం వెళ్తుంది! అన్న ఆసక్తి మొదలైంది. ఇంకా కేసులో ఎన్ని కారణాలు తెరపైకి వస్తాయో చూడాలి.

Spread the love