రికార్డ్‌ స్థాయికి వాణిజ్యలోటు

రికార్డ్‌ స్థాయికి వాణిజ్యలోటు– అక్టోబర్‌లో 31.46 బిలియన్లకు చేరిక
– ఎగిసిన దిగుమతులు
న్యూఢిల్లీ : భారత ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటంతో వాణిజ్య లోటు రికార్డ్‌ స్థాయిలో ఎగిసిపడింది. ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో 65.03 బిలియన్‌ డాలర్ల వాణిజ్య దిగుమతులు చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో సరుకుల ఎగుమతులు 33.57 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యా యని కేంద్ర వాణిజ్య శాఖ గణంకాలు వెల్లడించాయి. దిగుమతులు అధికం గా ఉండటం, ఎగుమతులు తక్కువ గా ఉండటంతో రికార్డ్‌ స్థాయిలో 31.46 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు చోటు చేసు కుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచడంతో పాటు అనేక ఉత్పత్తుల ధరలు పెరగడానికి ఆజ్యం పోసే ప్రమాదం ఉంది. గడిచిన నెలలో 20.50 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు చోటు చేసుకోవచ్చని రాయిటర్స్‌ పోల్‌లో నిపుణులు అంచనా వేయగా ..ఇది అమాంతం పెరగడం గమ నార్హం. 2022 ఇదే అక్టోబర్‌లో 26.31 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు చోటు చేసుకుంది. అదే సమయంలో 57.91 బిలియన్ల దిగు మతులు, 31.60 బిలియన్ల ఎగుమ తులు జరిగాయి. 2023 సెప్టెంబర్‌ లో 34.47 బిలియన్ల ఎగుమతులు, 53.84 బిలియన్ల దిగుమతులు నమోదయ్యాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాల అభివద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ ల్లో ప్రపంచ వృద్ధి మందగించడం వల్ల భారత ఎగుమతులు ప్రభావిత మయ్యాయి. ఈ దేశాలు కూడా ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్లను కఠినతరం చేయడాన్ని చూస్తున్నాయి. ఇది వ్యాపారం, వాణిజ్యంలో మంద గమనానికి దారి తీస్తుంది.
”గడిచిన అక్టోబర్‌లో వార్షిక ప్రాతిపదికన బంగారం దిగుమతులు 95 శాతం పెరిగాయి, ఇది వాణిజ్య లోటును పెంచడానికి దారితీసింది. నవంబర్‌లో దీపావళి పండుగ కారణంగా అక్టోబర్‌లో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గత ఏడాది అక్టోబర్‌లో దీపావళి జరుపు కున్నాము. 2023లో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి.” అని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ బర్త్వాల్‌ విలేకరులతో పేర్కొన్నారు.
”వాణిజ్య లోటు పెరగడంతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది. గత రెండేళ్లుగా తగ్గుతున్న మూలధన ప్రవాహాలు, అధిక వడ్డీ రేట్ల కారణం గా రూపాయి విలువ పుంజు కోవడా నికి కూడా సమయం పట్టవచ్చు. వాణిజ్య లోటును పెంచుతూ ఉంటే, రుణాలు తీసుకునే నిబంధనలు కఠినంగా మారతాయి. దీంతో మన తయారీ రంగాలను మనం ఎలా నిర్వ హిస్తాం. ప్రస్తుతం అధిక ఎగుమతు లకు డిమాండ్‌ను కనుగొనలేని ఉత్పాదక రంగాల అసమర్థత ఆందోళ నకరం. ఎగుమతులను మెరుగు పరచడానికి కొత్త మార్గాలను కనుగొ నవలసి ఉంటుంది.” అని జెఎన్‌యు ప్రొఫెసర్‌ బిశ్వజిత్‌ ధర్‌ పేర్కొన్నారు. ప్రపంచ దేశాల ఉత్పత్తు లతో పోటీ పడలేకపోవడం, గ్లోబల్‌ డిమాండ్‌ లోనూ స్తబ్దత నేపథ్యంలో భారత ఎగుమతులు తగ్గిపోతున్నాయని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.

Spread the love