హత్య కేసులో ఇద్దరికి జీవిత కారాగార శిక్ష..

నవతెలంగాణ- కంటేశ్వర్

హతుడు, హంతకులు నవయువకులే అవమానిస్తుడని, దొంగతనం చేశానని పదుగురిలో ప్రచారం చేస్తున్నాడని కక్ష పెంచుకుని వరుసకు తమ్ముడు అయిన యువకునిడి వెంటబెట్టుకుని కడతేర్చిన వైనం చివరికి జీవిత కారాగారం. కోర్టు వెలువరించిన ఇరవై ఐదు పేజీల తీర్పులో…నిజామాబాద్ రూరల్ దక్షిణ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ అధికారి కోర్టుకు నివేదించిన అభియోగ పత్రం ఆధారంగా పదిహేడు మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసుకుని, ఇరవై దృవీకరించుకున్న పత్రాలు,తొమ్మిది వస్తుగత సాక్ష్యాలు అధ్యయనం చేసిన అనంతరం,నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ నివాసులైన షేక్ ఫరీద్,సులేమాన్ ఖాన్ లపై హత్య అభియోగం రుజువు కావడంతో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తు నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల తీర్పు చెప్పారు.ధర్మపురి హిల్స్ కు చెందిన ఫరీద్,షేక్ జుబేర్ లు సారంగపూర్ లోని ఇజాజ్ బిరువాల కంపెనీ లో కార్మికులు గా పనిచేసేవారు. జుబేర్ చీటికీ,మాటికి అవమానించేవాడని, సెల్ ఫోన్ దొంగలించాడనని ప్రచారం చేశారని కక్ష పెంచుకున్నాడు.28 జులై, 2019న ఫోన్ చేసి పిలుపించుకుని ధర్మపురి శివారున గల గుట్ట పైకి తీసుకుకువెళ్లాడు.గుట్టపై జుబేర్ సెల్ ఫోన్ చూస్తుండగా వెనుక నుండి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్ తో తలపైన బలంగా కొట్టాడు, ఫరీద్ కు వరుసకు తమ్ముడైన సులేమాన్ కూడా రాడ్ తీసుకుని కొట్టాడు. కింద పడిపోయిన అతనిపై ఇద్దరు తలపై బండ రాయివేసి హత్య చేశారు. హత్య నేరాభియోగాలు రుజువు కావడం తో ఇద్దరికి జీవిత కారాగార శిక్ష విధించించారు.హతుడు జుబేర్ 18 ఎల్లవాడు కాగా,ముద్దాయిలు ఇద్దరు 19,20 ఏళ్ళ వయసువారు.