వాగ్దేవి కళాపీఠం లేఖా రచన పోటీలు

వాగ్దేవి కళాపీఠం ఆధ్వర్యంలో అంతర్జాతీయ అంతర్జాల లేఖా రచన పోటీలు నిర్వహించనున్నారు. ఈ లేఖా రచన పోటీలు అంతర్జాలంలో జూమ్‌ మాధ్యమం ద్వారా నిర్వహించబడును. నిర్వాహ కులు ఇచ్చిన నమూనా లేఖాంశంలోని ఒక అంశంపై లేఖ రాయవలసి ఉంటుంది. ఇందులో 1) ప్రియదర్శిని విభాగం – (10 సం. నుండి 20 సం.), 2) సంజీవదేవ్‌ విభాగం – (20 సం. పైబడిన వారందరూ) విభాగాలు ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 6లోగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 9391356105, 80191 83152, 8520973202 (వాట్సప్‌) నంబర్ల నందు సంప్రదించవచ్చు.