ఐలూ రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా విద్యాసాగర్‌

నవతెలంగాణ – భువనగిరి
భువనగిరిలో ఈ నెల 17, 18న జరిగిన ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలూ) రాష్ట్ర మహాసభలో 47 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కె.పార్థసారథి, కోశాధికారిగా వేణుగోపాల్‌రావు ఎన్నికయ్యారు. రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా విద్యాసాగర్‌ నియమి తులయ్యారు.