– ఎమ్మెల్యే శంకర్ నాయక్
నవతెలంగాణ-గూడూరు
గూడూరు మండలంలో ఆదివారం మహబూబాబా ద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ విస్తత పర్యటన చేసి పలు గ్రామాలలో ప్రచారం చేశారు. మొదట లక్ష్యంపురం తండా, అప్పరజుపల్లీ, జంగు తండా, జగన్ నాయకులగూడెం, మధునాపురం, గాజులగట్టు గ్రా మాలలో విస్తత పర్యటన చేసి ఓట్లను అభ్యర్థించారు. ఉదయం నుండి రాత్రి వరకు ఆయా గ్రామాలలో పర్య టించారు. ఈ సందర్భంగా లక్ష్మీపురం తండాలో గతంలో తెలంగాణ ఉద్యమ నేత, రైతు రాజ్యం పార్టీ వ్యవస్థాపకు లు బానోత్ మంగీలాల్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యం లో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయా గ్రామా లలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతు నా గెలుపు కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించా రు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యుడిగా భావించి, భవిష్యత్తులో సముచిత స్థానం గౌరవం కల్పిస్తా నని తెలిపారు. గూడూరు మండలాన్ని మరింత అభివద్ధి చేస్తానని కొత్త పాత తేడా లేకుండా అందరూ కలిసికట్టు గా పని చేయాలని సూచించారు. కొత్త బిచ్చగాడు పొద్దెరె డగననట్టు కొత్త కొత్త నాయకులు మీ ముందుకు వస్తార ని, వారి మాటలు నమ్మి మొసపోవద్దన్నారు. కారు గుర్తు కు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లలను అ భ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బిరవెళ్లి భరత్ కుమార్ రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ ఎండి ఖాసీం, మండలాధ్యక్ష, కార్యదర్శులు, వెంకట్ కష్ణ రెడ్డి, నుకల సు రేందర్, సర్పంచుల పురం మండలాధ్యక్షులు ముక్క లక్ష్మ ణ్ రావు, వైస్ ఎంపీపీ అరే వీరన్న, సంపత్ రావు, బొడా కిషన్, టౌన్ ప్రెసిడెంట్ వెంకన్న, మహిళ నాయకురాలు సమ్మక్క, రహీం, కటర్ సింగ్, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.