‘ఎవల్యూషన్‌ డే’ని మనం తప్పక జరుపుకోవాలి!

We must celebrate 'Evolution Day'!ఇంగ్లీషు నేచురలిస్ట్‌ ఛార్లెస్‌ డార్విన్‌ తన జీవ పరిణామ సిద్ధాంతాన్ని (ON THE ORIGIN OF SPECIES) ప్రకటించిన రోజు 24 నవంబర్‌ 1859- ఈ ఆధునిక వైజ్ఞానిక కాలానికి ఆ సిద్ధాంతం ఎంత ముఖ్యమో గ్రహించడానికి, ఆ శాస్త్రవేత్త మీద ఉన్న గౌరవం ప్రకటించు కోవడానికి 24 నవంబర్‌ను ‘ఎవల్యూషన్‌ డే’గా ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటు న్నాయి. దీన్ని పెద్దఎత్తున మన దేశంలో కూడా జరపడం చాలా అవసరం. ఎందు కంటే వైజ్ఞానిక దృక్పధం దేశంలో బలప డాలని చెప్పిన భారత తొలి ప్రధాని నెహ్రూ స్థాయిని తగ్గించాలని ప్రయత్నిస్తున్న – ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ చర్యల్ని తిప్పికొట్ట డానికి సామాన్య ప్రజలు వివేకవంతులై ఇలాంటి వైజ్ఞానిక కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పనిసరి! జీవ పరిణామ సిద్ధాంతం(THEORY OF EVOLOUTION) పనికిరానిదని ప్రభుత్వం- సిలబస్‌ నుండి తొలగిస్తోంది. భారత రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని ప్రవేశపెడతా మంటోంది. ఇలాంటి వాటిని అడ్డుకోవాలంటే, ప్రగతిశీల భావాలు గల వారంతా వైజ్ఞానిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపుకోవాలి.
1909లో డార్విన్‌ శతజయంతి, అర్థ శత వర్థంతి. సందర్భంగా నూటా అరవై ఏడు దేశాల నుండి నాలుగు వందల మంది ప్రముఖ శాస్త్రవేత్తలందరూ కేంబ్రిడ్జిలో సమావేశమై పెద్దఎత్తున డార్విన్‌కు నివాళులర్పించారు. ఆయన జీవశాస్త్రంలో చేసిన కృషిని శ్లాఘించారు. సామాన్య జనంలో డార్విన్‌ గూర్చి అవగాహన పెరగడానికి ఆయన పరిణామ సిద్ధాంతాన్ని వారికి పరిచయం చేశారు. న్యూయార్క్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌ – అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీలోనూ, రాయల్‌ సొస యిటీ ఆఫ్‌ న్యూజిల్యాండ్‌లోనూ, జరిపిన కార్యక్రమాలకు అనూహ్యంగా పెద్దఎత్తున జనం హాజరయ్యారు. యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోలో నవంబర్‌ 24-28 మధ్య డార్విన్‌ – శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు.
2009లో ‘బిబిసి డార్విన్‌ సీజన్‌’ శీర్షికతో బిబిసి టెలి విజన్‌/ రేడియో కార్యక్రమాలు నిర్వహించింది. ఎందుకంటే అది డార్విన్‌ ద్విశత జయంతి పైగా, డార్విన్‌ పరిణామ సిద్ధాంతం వెలువడి 150 ఏళ్లయింది. ఇలా ప్రపంచ దేశాల్లో జరిగిన, జరుగుతున్న కార్యక్రమాలు చాలానే ఉన్నా యి. ఇలాంటివి మన దేశంలో ఎన్ని జరిగాయీ? అనేది ఆలోచించుకోవాలి!
ఈ విషయాల్లో మన దేశ పరిస్థితులు మరీ దిగదుడుపుగా ఉన్నాయి. మత పర మైన పండుగలకు స్కూళ్లు, కాలేజీలు, ఆఫీ సులకు సెలవులిస్తూ అర్థరహితమైన పండు గల్ని ప్రభుత్వాలు ప్రమోట్‌ చేస్తున్నాయి. కుటుంబాలలో జరిగే పూజలు, పునస్కా రాలు, ఆచారాలు, సంప్రదాయాల వల్ల యువతరం మెదళ్లు కలుషితం అవుతు న్నాయి. దేవుళ్ల శోభాయాత్రల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం దొరు కుతోంది. వివేకవంతమైన, అర్థవంతమైన వైజ్ఞానిక కార్యక్రమాలు విద్యాసంస్థల్లో గానీ, పౌర సమాజాల్లో గానీ కుటుంబాల్లో గానీ ఏ ఒక్కటైనా నిర్వహిస్తున్నారా? లేదు కదా? అందుకే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సైన్సు కార్య కర్తలు, బాధ్యతగల పౌరులు, వివేకవంతమైన అధికారులు, మరీ ముఖ్యంగా మహిళలు పూనుకుని – దేశంలో కొన సాగుతున్న విషమ పరిస్థితులను అర్థం చేసుకుని, ఎక్కడి కక్కడ ఎవరికివారు వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలకు రూపకల్పన చేసుకోవాలి. ఉట్టి ఆలోచన లతో పని జరగదు. వాటిని ఆచరణలో పెట్టాలి. విద్యా సంస్థల్లో పనిచేసే వారిపై బాధ్యత మరింతగా ఉంది. విద్యార్థులకు జీవ పరిణామంపై, డార్విన్‌పై, సందర్భాన్ని బట్టి ఇంకా అనేక వైజ్ఞానిక అంశాలపై వ్యాస రచన/ ఉపన్యాస పోటీలు పెడుతూ వారిలో వైజ్ఞానిక జిజ్ఞాస పెంచాలి. భావిభారత పౌరులు వారే గనక, మనం వారి మీదే శ్రద్ధపెట్టాలి. వారిని హేతుబద్దంగా ఆలోచింపజే యాలి. మానవ వాదులుగా తీర్చి దిద్దుకోవాలి. చేస్తున్న కార్యక్రమాలతో మనం మరొకరికి స్పూర్తినిస్తూ ఉండాలి!
సైన్స్‌ డే (28,ఫిబ్రవరి), పర్యావరణ పరి రక్షణ దినం (5 జూన్‌), డార్విన్‌ డే (12 ఫిబ్ర వరి), ఎవల్యూషన్‌ డే (24 నవంబర్‌), కైండ్‌ నెస్‌ డే (13 నవంబర్‌), హ్యూమనిస్ట్‌ డే ( 21 జూన్‌), ఎర్త్‌ డే (24 ఎప్రిల్‌), సైంటిఫిక్‌ టెంపర్‌ డే (20 ఆగష్టు), ఫిలాసఫీడే (నవంబరులో మూడో గురువారం), వుమెన్స్‌ డే (8 మార్చి), చిల్డ్రన్స్‌ డే (14 నవంబర్‌) వంటివి విద్యా సంస్థల్లో తప్పక నిర్వహిస్తూ ఉండాలి. విద్యా ర్థుల అవగాహన, స్థాయి పెంచడానికి ఆయా విషయాలు ఇతివృత్తంగా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేయాలి. వీటితో పాటు సంవిధాన్‌ దివస్‌ (CONSTITUTION DAY 26 నవంబర్‌) కూడా తప్పక జరుపుతూ ఉండాలి. ప్రస్థుతం మతాల కున్న ప్రాముఖ్యాన్ని తగ్గించి, వైజ్ఞానిక దృక్పథం, హేతు వాదం, మానవవాదం నిత్య జీవితంలో భాగమైపొయ్యే ట్లుగా చేస్తూ ఉండాలి.
ఎవరి వ్యక్తిగత విశ్వాసాలనో దెబ్బతీయాలని మనం అనుకోవడం లేదు. అవి వాటి పరిధిలో అవి ఉంటే సంతో షిద్దాం – అంతే! మత విశ్వాసాలెప్పుడూ వ్యక్తిగత స్థాయిలో ఉండాలి. అంతేగాని, వికృతంగా సమాజ స్వరూపాన్ని మా ర్చేంత దుర్మార్గంగా ఉండకూడదు. అయితే, మత విశ్వాస కులతో ప్రపంచం ప్రగతి పథాన నడవలేదని మాత్రం ఖచ్చితంగా చెబుదాం! మనుషులంతా ఒక్కటి అని తెలు సుకున్న వాళ్లం గనుక, విశ్వాసకుల్ని, అవిశ్వాసకుల్ని అంద రినీ సమానంగా గౌరవిస్తాం. అయితే విశ్వాసకులు తమ అంధ విశ్వాసాన్ని వదిలేసి మానవవాదులుగా మారితే వారిని మరింతగా గౌరవిస్తాం… సైన్సు కార్యకర్తలంతా ఆ పనుల్లో అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉండాలి.
చంద్రయాన్‌ – 3 విజయవంతమైందని, అందుకు కారణం తనే అన్నట్టు అనవసరంగా అసందర్భంగా ఆన్‌ లైన్‌లో దేశ ప్రజలకు కనబడి, భారతీయ మువ్వన్నెల జెండా ఊపిన నేటి ప్రధాని మోడి చేసిన నిర్వాకం ఈ దేశ ప్రజలు గ్రహించాలి. ఇస్రో శాస్త్రవేత్తల జీతాల్లో కోతలు విధించడం గురించి – ఇస్రోకు ముడి సరుకు అందించిన వేల మంది సాంకేతిక నిపుణులకు, కార్మికులకు జీతాలివ్వక పోవడం గురించి – ఈ దేశ ప్రజలు తెలుసుకోవాలి. వారంతా పొట్ట పోసుకోవడానికి రోడ్ల మీద టీలు, టిఫిన్లు అమ్ముకోవడం, బయట మెకానిక్‌లుగా, డ్రైవర్లుగా పని చేయడం గురించి – ఈ దేశ ప్రజలు తెలుసుకోవాలి. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని శ్లాఘించకుండా, దాన్ని తన ఎలక్షన్‌ ఎజెండాలో చేర్చుకోవడం గురించి – ఈ దేశ ప్రజలు తెలు సుకోవాలి. పైగా, పురాతన భారతీయ విమానయాన శాస్త్రంలో ఇవన్నీ రాసిపెట్టే ఉన్నాయని అబద్దాలు ప్రచారం చేసుకుంటూ ఉండడం గురించి – ఈ దేశ ప్రజలు తప్పక తెలుసుకోవాలి. ఇది నేటి శాస్త్రవేత్తల కృషిని స్థాయిని తగ్గించినట్లుగా ఉందన్న విషయం తెలుసుకుని ఈ దేశ ప్రజలు కలత చెందాలి! ఈ అంశాల గూర్చి సీరియస్‌గా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఈ విషమ పరిస్థితు ల్లోంచి బయటపడే మార్గాల్ని అన్వేషించుకోవాలి.
రాబోయే కాలాలలో విద్యావంతులతో ముఖ్యంగా వైజ్ఞానిక పిపాస గల వివేకవంతులతో ప్రభుత్వాల్ని ఏర్పా టు చేసుకునే విధంగా చూసుకోవాలి. ఇటీవల కర్నాటకలో ప్రజా సంఘాలు నిర్వహించిన పాత్రను ఆదర్శంగా తీసు కుని, ఇతర రాష్ట్రాలలో కూడా ప్రజా – సామాజిక – విద్య – వైజ్ఞానిక సంఘాలు చైతన్యవంతంగా కదలాలి. తప్పదు – దేశం వేల ఏండ్లు వెనక్కి వెళ్లాలంటే ఎవరూ ఏమీ చేయ నక్కరలేదు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆ పని సజావుగా చేస్తూనే ఉంది. లేదు – దేశం ప్రగతి పథాన సడవాలంటే మాత్రం దేశ పౌరులందరూ సమైక్యంగా కదలాలి. ఆ మాట నేను అంటున్నది కాదు సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిసే అలా చెప్పారు. ప్రజలు పెద్దఎత్తున రోడ్ల మీదికి రావాలని చెప్పారు. అంతేకాదు, తను ప్రజల వెంటే ఉన్నానని కూడా ధైర్యం చెప్పారు.
‘నిన్ను నువ్వు తెలుసుకో’ – అని లేని దేవుణ్ణి ధ్యానిస్తూ కళ్లు మూసుకోవడం కాదు. నువ్వెవరు? ఎన్ని పరిణా మాలు జరిగి, నువ్వు ఇలా మారావు- అన్నది తెలుసు కుంటే – నీ కళ్లు తెరుచుకుంటాయి! ఎన్నెన్ని మానవ జాతులు ఉద్భవించి అంతరించాయి. ఎన్ని వలసల తర్వాత నీ జాతి ఇప్పుడు నువ్వున్న ప్రాంతానికి చేరింది వంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే, తప్పదు – జీవ పరిణామం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ భగవంతుడి సృష్టిలో నీ పుట్టుక ఒక భాగమని నువ్వింకా భావిస్తూ ఉంటే గనక, నీ మెదడ్లో చీకటి తొలగిపోలేదని అర్థం. చీకట్లోనే జీవితం బాగుందనుకునే వారితో మనకు పేచీ లేదు. జీవితంలో వెలుగులు కావాలనుకునే వారు తప్పక వైజ్ఞానిక స్పృహ పెంచుకుంటారు. జీవ పరిణామం గురించి తెలుసుకుంటారు. మత మౌఢ్యాన్ని చావుదెబ్బ తీసిన డార్విన్‌ పరిణామ సిద్ధాంతం వెలువడిన ఆ రోజును గుర్తు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ‘ఎవల్యూషన్‌ డే’ జరుపుకుంటారు.
ఎక్కడి పాట అక్కడ పాడడం, అధి కారం కోసం నానా గడ్డి కరవడం రాజకీయ నాయకులకు అలవాటు. శాస్త్రవేత్తలు అలా చేయరు. ఒక నిబద్దతతో, నిజాయుతీగా, నిజాల్ని మాత్రమే వెల్లడిస్తారు. అలాంటి వారిలో మహోన్నతుడు చార్లెస్‌ డార్విన్‌! ఆయన మతాలకున్న విలువను తగ్గించా లనుకోలేదు. మూఢ నమ్మకాల్ని నిర్మూలించ గలననీ కూడా అనుకోలేదు. ఆయన ప్రతి పాదించిన సిద్ధాంతమే కాలక్రమంలో ఆ పనులు చేస్తూ వచ్చింది. అందుకే సంప్ర దాయ వాదులకు డార్విన్‌ అన్నా, డార్విన్‌ సిద్దాంతమన్నా పడదు. వారు సృష్టి/ దైవ సిద్దాంతం కావాలనుకుంటారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నవారి పాలసీ కూడా అదే! సిలబస్‌ నుండి ‘ఎవల్యూషన్‌’ ఛాప్టర్‌ తొలగి స్తున్నారని తెలియగానే, హైద్రా బాదులో పెద్దపెద్ద విద్యా సంస్థల్లో జేవీవీ వారు ఎవల్యూషన్‌ మీద నా లెక్చర్స్‌ ఏర్పా టు చేశారు. నేను కూడా సంతోషంగా వెళ్లి ఉపన్యసించి వచ్చాను. సిలబస్‌ నుండి తీసివేయగానే పిల్లలు ఇక ఏ రకంగానూ నేర్చుకోలేరన్న భ్రమలో ప్రభుత్వం వారుంటే- ఉండని వ్వండి. బాధ్యత గల పౌరులుగా మన పిల్లలకు మనం, ఏం నేర్పుకోవాలో మనకు తెలుసు కదా? ప్రభు త్వాలు తాత్కాలికం – వైజ్ఞానిక స్పృహే శాశ్వతం! అందు వల్ల మనం, వీలైనన్ని ఎక్కువగా వైజ్ఞానిక కార్యక్రమాలు అన్ని స్థాయిల్లో నిర్వహించుకుంటూనే ఉండాలి.
(నవంబర్‌ 24 ‘ఎవల్యూషన్‌డే’)
– సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌ (మెల్బోర్న్‌ నుంచి)

డాక్టర్‌ దేవరాజు మహారాజు

Spread the love
Latest updates news (2024-04-29 00:13):

serenity bS1 cbd gummies price | review smilz cbd gummies kT6 | cbd gummies tinnitus relief 9WY | IaF green otter cbd gummies reviews | gummy cbd qs2 in brunswick ohio | cbd online sale gummies diy | oros cbd gummies uMQ price | cbd 200mg gummies official | keoni cbd gummies to quit A4I smoking | can Faf cbd gummies cause psychosis | renown cbd OVO gummies for sale | just cbd 64a gummies legal | pBK plus cbd gummies mango | cbd full msY spectrum gummies for sale | plus cbd gummies ingredients LSx | 4jR plus peoducts cbd gummies review | tru cbd cream cbd gummies | gummi cbd free trial | good cheap cbd PAL gummies | can 8eB you fly with thc cbd gummies | 9c8 250 mg gummies cbd | wyld cbd hybrid xna gummies | ESx cbd gummies organic vegan | cbd gummies port nWK aransas | is cbd gummies legal HoL in tennessee | cbd Izg gummies and bloating | cbd oil the tbw good gummies | how long for cbd gummy w0P to kick in | 2ux cbd gummies for pain prices | can cbd gummies give x08 headache | kushly cbd gummies LeU ceo | TLC cbd gummies for osteoarthritis | wyld elderberry cbd gummies 3VG | cbd gummy bears H5S hawaii | cbd gummies GVb with thc for pain | best website to mIB buy cbd gummies | cbd gummies E0I how fast they work | clinical cbd eIO gummies amazon | where to buy oros cbd k9z gummies | what is smilz Aop cbd gummies | 500 mg gummies azW cbd | calm cures dJs cbd gummies | cbd uy1 gummies para que sirve | cbd living help u06 gummies | 100 mg ymA of cbd gummies | QIF cbd gummies for sleep side effects | cbdistillery sleep 5xD aid cbd gummies 30mg cbd | shark tank eagle hemp cbd gummies reviews 5bx | platinum x cbd Cbf gummies review | zilla cbd gummies most effective