18 మంది ఏఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీసు శాఖలో పలువురికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. 18 మంది అడిషనల్‌ ఎస్పీలకు ఎస్పీలుగా(నాన్‌క్యాడర్‌), 35 మంది డీఎస్పీలకు అడిషనల్‌ ఎస్పీలుగా పదోన్నతి కల్పించింది. పదోన్నతి పొందిన అధికారులు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. పదోన్నతి పొందిన అధికారులకు డీజీపీ అంజనీ కుమార్‌ అభినందనలు తెలిపారు. కాగా, 2009 బ్యాచ్‌కు చెందిన సుమారు 200 మంది ఎస్సైలకు ఇన్‌స్పెక్టర్లుగా, 1996, 98 బ్యాచ్‌కు చెందిన 160 మందికి పైగా ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించడానికి సంబంధించిన ఫైల్‌ ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. దాని క్లియరెన్స్‌కు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.

Spread the love