చైనాలో కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి

నవతెలంగాణ – చైనా:చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని గనిలో ఆదివారం కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ తెలిపింది. ప్రావిన్స్‌లోని దక్షిణాన లెషాన్ నగరానికి సమీపంలో ఉన్న పర్వత ప్రాంతంలో ఉదయం 6 గంటలకు కొండచరియలు విరిగిపడ్డాయి. పర్వతప్రాంతం స్థానిక మైనింగ్ కంపెనీ ఉత్పత్తి, లివింగ్‌ ఫెసిలిటీపై కూలినట్లు పేర్కొంది. 180 మందికిపైగా రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలంలో మోహరించినట్లు పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని సీసీటీవీ పేర్కొంది. సంఘటన జరగడానికి రెండు రోజుల ముందు లెషాన్ నగరం భారీ వర్షం కురిసినట్లు వాతావరణ ట్రాకింగ్ డేటా పేర్కొంది.

Spread the love