సాహితీ వార్తలు

25 న ‘క్రియ ఒక జీవన లయ’ ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కతిక శాఖ, కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కవి డా. ఎన్‌. గోపి రచించిన కవితా సంపుటి ‘క్రియ ఒక జీవన లయ’ ఆవిష్కరణ ఈ నెల 25న ఆదివారం సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరం (మొదటి అంతస్తు)లో నిర్వహించనున్నారు. డా. వోలేటి పార్వతీశం అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయులు కె. రామచంద్ర మూర్తి పుస్తకావిష్కరణ చేస్తారు. కిల్లాడ సత్యనారాయణ  కతిని స్వీకరిస్తారు. డా. మామిడి హరికష్ణ, వంగల హర్షవర్ధన్‌, డా. ఎస్‌. రఘు, కుడికాల వంశీధర్‌ పాల్గొంటారు.
జాతీయస్థాయి కథల పోటీ
మలిశెట్టి సీతారామ్‌ స్మారకార్థం నిర్వహిస్తున్న ఎమ్మెస్సార్‌ సాహితీ పురస్కారం 2023 జాతీయ స్థాయి కథల పోటీని నిర్వహిస్తున్నారు. ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతులుగా రూ.5,000/, రూ3,000/-, రూ.2,000/- అందించనున్నారు. ఆసక్తి కలిగిన వారు జూలై 15లోగా పలమనేరు బాలాజీ, పలమనేరు రచయితల సంఘం, 6/219 గుడియాత్తం రోడ్‌, పలమనేరు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ – 517408 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు యుగంధర్‌ – 93947 82540, శాస్త్రి – 88857 62720 నంబర్ల నందు సంప్రదించవచ్చు.
25న మైసూరులో శ్రీశ్రీ కళావేదిక ‘తెలుగు- కన్నడ కవితాగోష్టి’
శ్రీశ్రీ కళావేదిక కర్ణాటక రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జూన్‌ 25 న కర్ణాటక రాష్ట్రం రాచనగరి మైసూరులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ హాల్‌ నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు తెలుగు – కన్నడ కవితా గోష్టి నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ప్రభాశాస్త్రి నిర్వహణలో జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళావేదిక అంతర్జాతీయ చైర్మన్‌ డా. కత్తిమండ ప్రతాప్‌ హాజరు కానున్నారు. సుమారు 120 మంది కవులు, సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలుగు – కన్నడ సాహిత్యం, సంస్కతి, సాంప్రదాయాలు, భాషా పరిరక్షణ అనే అంశాలపై సదస్సు, జాతీయస్థాయి శత కవిసమ్మేళనం జరగనుంది. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ గౌరవ అధ్యక్షులు ఇంద్రకుమార్‌ రాజు దుబాయి నుండి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు నిర్వాహకులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
21, 22లలో జాగృతి సాహిత్య సభలు
జూన్‌ 21 22 తేదీలలో భారత జాగతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత నేతత్వంలో సాహిత్య సభలు సారస్వత పరిషత్‌లో జరగనున్నాయి. 21వ తేదీ ఉదయం 10 నుంచి 22వ తేదీ సాయంత్రం వరకు ఈ సభలు కొనసాగుతాయి. ఈ సభలకు గోరేటి వెంకన్న, నందిని సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, ఏనుగు నరసింహారెడ్డి, అనిశెట్టి రజిత, గోగు శ్యామల, తుమ్మేటి, దేవకీదేవి తిరునగరి మొదలైన వాళ్ళు అతిథులుగా పాల్గొంటారు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, వడ్డేపల్లి కష్ణ, సంగనభట్ల నరసయ్య, నిత్యానందరావు, సంగిశెట్టి శ్రీనివాస్‌, వెల్దండ శ్రీధర్‌ తదితరులు పత్ర సమర్పణలు చేస్తారని డాక్టర్‌ కాంచనపల్లి గోవర్ధన్‌ రాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
వాకాటి పాండురంగారావుపై రచనలకు ఆహ్వానం
బహుముఖ ప్రజ్ఞాశాలి వాకాటి పాండురంగారావు ప్రతిభాపాండిత్యాలను, సజనాత్మక కళానైపుణ్యాలను, వ్యక్తిత్వ సౌశీల్యాలను వెల్లడి చేసేట్టు ఒక విశేష సంకలనాన్ని వెలువరించాలనుకుంటున్నాం. ఇదివరకే వెలువడిన ఇతరుల లేదా మీ రచనలు పంపడం, సూచించడంతో పాటు కొత్తగా రాసి కూడా పంపవచ్చు. ఆయన కథలు, వ్యాసాలు, సంపాదకీయాలు, నవలలు, కవితలు, గేయాలు, ప్రసంగాలు, ముందుమాటలలో మీకు బాగా నచ్చినవేమిటో కూడా సూచించవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆగస్ట్‌ 15లోగా వాకాటి పి.ఆర్‌., 208, ఫిప్త్‌ ఫ్లోర్‌, లుంబినీ రాక్‌ కాస్టల్‌ అపార్ట్‌మెంట్స్‌, రోడ్‌ నెం. 4, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌ – 03 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు మెయిల్‌ ఐడి : ఙaసa్‌ఱ.జూతీఏస్త్రఎaఱశ్రీ.షశీఎ, 8790007042 నంబరు నందు సంప్రదించవచ్చు.