– డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హర్షం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో స్వేరోస్ పదానికి చోటు లభించడం పట్ల బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు, స్వేరోస్ నెట్వర్క్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది లక్షలాది మంది స్వేరోల విజయంగా అభివర్ణించారు. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం పునాదులుగా నూతన విప్లవం కోసం తెలుగు నేలపై 2012లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో పురుడుపోసుకున్న స్వేరోస్ పదం విశ్వవ్యాప్తమైందని తెలిపారు. మరో వారం రోజుల్లో విడుదలయ్యే ఆక్స్ఫర్ డిక్షనరీ లేటెస్టే వర్షెన్లో స్వేరోస్ పదాన్ని చూడవచ్చు. ఈ సందర్బంగా పద సృష్టికర్త డాక్టర్.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ, స్వేరోస్ అర్ధం సోషల్ వెల్ఫేర్ ఏరోస్ (స్కై ఇస్ ద లిమిట్ ) అని తెలిపారు.