ఎమోషనల్‌ థ్రిల్లర్‌

బసవతారక రామ క్రియేషన్స్‌ పేరుతో ఎన్టీఆర్‌ పెద్ద కుమారుడు నందమూరి జయకష్ణ నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసి, తొలి చిత్రంగా తన తనయుడు చైతన్యకష్ణని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ‘బ్రీత్‌’. ఈ చిత్రానికి వంశీకష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని లాంచ్‌ చేశారు మేకర్స్‌.
ఈ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిర్మాత నందమూరి జయకష్ణ మాట్లాడుతూ,’ ఇదొక ఎమోషనల్‌ థ్రిల్లర్‌. అన్ని వర్గాల వారిని అలరించేలా ఉంటుంది. మా అమ్మానాన్నల పేరుతో బసవ తారక రామ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వారికి అంకితం చేస్తున్నాను’ అని తెలిపారు. ‘వంశీకష్ణ ఆకెళ్ళ చక్కని కథ, కథనంతో ఈ చిత్రాన్ని మలిచారు. ప్రతి పాత్ర, సన్నివేశం అర్థవంతంగా ఉంటుంది. హీరోయిన్‌ వైదిక అద్భుతంగా నటించింది’ అని హీరో చైతన్యకష్ణ అన్నారు. దర్శకుడు వంశీకష్ణ ఆకెళ్ళ,’ఇంత మంచి థ్రిల్లర్‌ని చేసే అవకాశం ఇచ్చినందుకు హీరో, నిర్మాతలకు థ్యాంక్స్‌. ఇదొక సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌. సినిమా చూస్తున్నపుడు షాక్‌, ఎగ్జైట్‌మెంట్‌, థ్రి¸ల్‌ అన్నీ ఫీలవుతారు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఉన్న యూనిక్‌ థ్రిల్లర్‌ ఇది’ అని చెప్పారు.

Spread the love