భిన్న కాన్సెప్ట్‌తో.. హర్‌

కథానాయిక రుహాణి శర్మ నటించిన డిఫరెంట్‌ లేడీ ఓరియెంటెడ్‌ కాన్సెప్ట్‌ చిత్రం ‘హర్‌’. పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీధర్‌ స్వరాఘవ్‌ దర్శకత్వం వహించారు. డబుల్‌ అప్‌ మీడియాస్‌ సంస్థ తొలి ప్రొడక్షన్‌గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. ఈ చిత్రంలో వికాస్‌ వశిష్ట, ప్రదీప్‌ రుద్ర, జీవన్‌ కుమార్‌, అభిగ్య, సంజరు స్వరూప్‌, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ ఫినిష్‌ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఈ సినిమా ఫైనల్‌ కాపీ చూసి, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ దీన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకు రావడమే తమ విజయానికి తొలి మెట్టు అని దర్శక, నిర్మాతలు తెలిపారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను నిర్మాత డి. సురేష్‌ బాబు రిలీజ్‌ చేశారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ద్వారా ఈ సినిమా జూలై 21న థియేటర్లోకి రాబోతోంది. ఈ సినిమా ఆడియో హక్కులను సరిగమ సొంతం చేసుకుంది. ఇప్పటికే రిలీజ్‌ చేసిన పోస్టర్స్‌, టీజర్‌ సినిమాపై హైప్‌ పెంచాయని, సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే దీమాని, మంచి కాన్సెప్ట్‌ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకాన్ని మేకర్స్‌ వ్యక్తం చేశారు.

Spread the love