![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/images-251-300x225.jpeg)
-ప్రభుత్వానికి రూ.17 కోట్ల 38 లక్షల ఆదాయం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆబ్కారీ శాఖ అశ్వారావుపేట సర్కిల్ పరిధిలోని రెండు మండలాల్లో గల 11 మద్యం దుకాణాలకు గతేడాది కంటే ఈ ఏడాది ఆశావాహులు పెరిగారు.
గతంలో 700 పై చిలుకు దరఖాస్తులు రాగా ఈ ఏడాది 869 దరఖాస్తులు అందాయి. అశ్వారావుపేట మండలం లోని 6 దుకాణాలకు 457 దరఖాస్తులు రాగా,దమ్మపేట మండలంలోని 5 దుకాణాలకు 412 దరఖాస్తులు చేసారు.ఈ దరఖాస్తులు ద్వారా ప్రభుత్వానికి రూ.17 కోట్లు,38 లక్షల ఆదాయం లభించింది.
అశ్వారావుపేట
దుకాణం నెంబర్ దరఖాస్తులు
33 85
34 88
35 83
36 45
37 82
38 75
దమ్మపేట
39 71
40 91
41 97
42 87
43 65
అశ్వారావుపేట మండలంలోని 34 వ షాపుకు 88,దమ్మపేట లోని 41 వ, షాపుకు 97 అత్యధికంగా దరఖాస్తులు పడ్డాయి. అశ్వారావుపేట లో ఎస్.సి లకు కేటాయించిన 36 వ,షాపుకు 45,దమ్మపేట లో ఎస్.సి కేటగిరీ 43 వ, షాపుకు 65,బీ.సీ (గౌడ్) లకు కేటాయించిన షాపు నెంబర్ 39 కి 71 దరఖాస్తులు నమోదు అయ్యాయి.