టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్‌రెడ్డి విజయం

– ఎలిమినేషన్‌ రౌండ్‌తోనే తేలిన ఫలితం
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి – హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌రెడ్డి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎన్నికల సంఘం నిర్ణయించిన మ్యాజిగ్‌ ఫిగర్‌ 12,709 ఓట్లు రాకపోవడంతో చేపట్టిన ఎలిమినేషన్‌ రౌండ్‌తో ఫలితం వచ్చింది. ఈ నియోజకవర్గంలో 29,720 ఓట్లకుగాను 25,868 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 25,416 ఓట్లు మాత్రమే చెల్లాయి. 452 ఓట్లను చెల్లని ఓట్లుగా గుర్తించారు. వీటిలో ఏవీఎన్‌రెడ్డికి 7,505, గుర్రం చెన్నకేశవరెడ్డికి 6,584, పాపన్నగారి మాణిక్‌రెడ్డికి 4,569 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యతతోపాటు 20 ఎలిమినేషన్‌ రౌండ్‌తో ఎన్నికల సంఘం నిర్ణయించిన మ్యాజిక్‌ ఫిగర్‌ వచ్చింది. దీంతో ఎన్నికల అధికారులు ఏవీఎన్‌రెడ్డి గెలిచినట్టు ప్రకటించారు. అయితే ఏవీఎన్‌రెడ్డికి రెండో ప్రాధాన్యత ఓట్లు 5,931 వచ్చాయి. శుక్రవారం ఉదయం 3గంటలకు ఎలిమినేషన్‌ రౌండ్‌ పూర్తయింది. ఉదయం 3.45గంటలకు ఏవీఎన్‌రెడ్డి గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అనంతరం 4గంటలకు గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు.

Spread the love