శాంతిభద్రతల పరిరక్షణతో ప్రజలకు నిరంతరం భరోసా

నగర సీపీ సీవీ ఆనంద్‌ ప్రత్యేక ప్రణాళికతో నగరం ప్రశాంతం
సిటీ పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షులు ఎన్‌.శంకర్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల అదుపుతో ప్రజలకు నిరంతరం భరోసా కల్పిస్తున్న పోలీస్‌శాఖ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సిటీ పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎన్‌. శంకర్‌రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘పోలీస్‌ ఉద్యోగం అంటేనే రిస్క్‌తో కూడుకుంది. బందోబస్తులు, శాంతి భద్ర తల పర్యy ేక్షణలో ఎప్పుడు ఎక్కడ విధులు నిర్వహిస్తారో తెలియదు. ఇక హైదరాబాద్‌ నగరంలో విధులు నిర్వహించాలంటే కత్తిమీద సాములాంటిది. నగరంలో నిత్యం వీవీఐపీల మూమెంట్‌, ధర్నాలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు అధికం. దీనికితోడు పండుగలు, శోభయాత్రలతోపాటు ఇతర ఈవెంట్స్‌కు భద్రతా చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. అన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉంటూ ప్రశాంతవాతావరణంలో అన్నిటిని పూర్తి చేసేందుకు ఎంతో కృషి అవసరం. అది మా సార్‌ సీవీ ఆనంద్‌ గారికి ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు చోటుచేసుకోకుండా సీపీ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేస్తుం టారు. నగరంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేస్తున్నారు. అయితే నేరస్తులతో ఫ్రెండ్లీ కాదు, ఫిర్యాదు దారులు, బాధితులు, నగర వాసులతో ఫ్రెండ్లీగా ఉండాని సీపీ క్షేత్రస్థాయిలో ఆదేశాలించారు. విధుల్లో ప్రతిభకన బరుస్తున్న పోలీస్‌ సిబ్బందికి క్యాష్‌ రివార్డులు, ప్రోత్సాహ కాలు అందిస్తున్నారు. సిబ్బందిని ఆరోగ్యంగా ఉంచేందుకు ‘ఫిట్‌ క్యాప్‌’ను ప్రారంభించారు. ఆరోగ్యవంతమైన జీవితానికి ఆహార అలవాట్లలో మార్పుతోపాటు ఫిజికల్‌ యాక్టివిటీ ఉండాలని ప్రతి పోలీస్‌స్టేషన్లలో ఫిజికల్‌ యాక్టివిటీని మెరుగు పర్చారు. ఒక్కసారీ’ఫిట్‌ క్యాప్‌ యాప్‌’ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే అదే మానిటరింగ్‌ చేస్తుంది.

Spread the love