మంత్రి జన్మదినం సందర్భంగా కౌన్సిలర్‌ అన్నదానం

నవతెలంగాణ-జోగిపేట
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా ఆందోల్‌ జోగిపేట మున్సిపల్‌ 12వ వార్డు కౌన్సిలర్‌ కోరబోయిన నాగరాజు (నాని) ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని డీసీహెచ్‌ఎస్‌ సంగారెడ్డి ప్రారంభించారు. సుమారుగా 200 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ నాగరాజు మాట్లాడుతూ.. హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఎంతో మందికి సహా య సహకారాలు అందిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారన్నారు. ఆయన మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకొని, మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డిబి నాగ భూషణం ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్‌ చౌరస్తాలో కేక్‌ కట్‌చేసి, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, వైస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేశం, గోపా ల్‌ రావు, అనిల్‌, శంకర్‌, రావులు, ఖాజా పాషలు ఉన్నా రు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్‌ఎంవో అనుష, అందోల్‌ నియోజకవర్గం ఆత్మగౌ రవ కమిటీ అధ్యక్షులు వీరభద్రరావు, కమిటీ సభ్యులు సంతోష్‌, ప్రవీణ్‌, వాసవి క్లబ్‌ జోగిపేట అధ్యక్షులు రంగ కిషన్‌, మాజీ చేనేత అధ్యక్షులు సత్యం, బీఆర్‌ఎస్‌ నాయకులు లక్ష్మణ్‌, రవీంద్రగౌడ్‌, సత్యం, దశరథ్‌, ప్రభు, యూత్‌ సభ్యులు భీమ్రాజ్‌, పవన్‌, నాగా ర్జున, సురేష్‌, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love