జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు కోర్టు అనుమతి..

నవతెలంగాణ-హైదరాబాద్ : వారణాసి జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై వారణాసి కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ మసీదు ప్రాంగణమంతా భారత పురావస్తు పరిశోధనా సంస్థ ద్వారా సర్వే చేసేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు హిందూ ప్రతినిధుల తరఫున వాదలు వినిపిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ వెల్లడించారు. జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కొందరు హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ మేరకు వారణాసి కోర్టు.. ఆ ప్రార్థనా స్థలంలో గతంలో వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశించింది. సర్వే కొనసాగుతుండగా అక్కడ శివలింగం కనిపించిందంటూ హిందూ పక్షం వేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు.. ఆ ప్రదేశాన్ని సీల్‌ చేయాలని, సీఆర్పీఎఫ్‌ భద్రతలో ఉంచాలని ఉత్తర్వులిచ్చింది.