எவனோ ஒருத்தன் ஆரம்பிச்சி வச்சான், இப்ப நிறைய பேரு இதே மாதிரி பைக்ல வெடி கட்டி வீடியோ போட ஆரம்பிச்சிட்டானுக. pic.twitter.com/cpofhXjV6W
— 𝗟 𝗼 𝗹 𝗹 𝘂 𝗯 𝗲 𝗲 (@Lollubee) November 12, 2023
నవతెలంగాణ – తమిళనాడు: దీపావళి సందర్భంగా తమిళనాడులో కొందరు రెచ్చిపోయారు. జాతీయ రహదారిపై బైక్‌పై టపాసులు పేల్చుతూ ప్రమాదకర స్టంట్స్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. ఓ యువకుడు తన బైక్ ముందు ఉన్న లైట్ భాగంలో టపాసులను అమర్చాడు. ఆ తర్వాత వాటికి నిప్పు పెట్టి రోడ్డుపై వేగంగా దూసుకెళ్లాడు. ఆ సమయంలో బైక్ ముందు టైర్లను గాల్లోకి లేపి ప్రమాదకర స్టంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నవంబర్ 9న సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియో చూసిన తిరుచ్చి పోలీసులు సదరు యువకుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. యువకుడి బైక్ స్టంట్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.