22న ‘చీకటి వెన్నెల’ ఆవిష్కరణ

ఝాన్సీ కొప్పిశెట్టి కథల సంపుటి – చీకటి వెన్నెల, దీర్ఘకవిత – ఎడారి చినుకు పుస్తకాల ఆవిష్కరణ సభ పాలపిట్ట, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 22న శనివారం సాయంత్రం 6.00 గంటలకు రవీంద్రభారతి పైడి జయరాజ్‌ హాల్‌లో నిర్వహించనున్నారు. ఓల్గా అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమంలో కొండేపూడి నిర్మల, సమ్మెట ఉమాదేవిలు పుస్తకాలను ఆవిష్కరిస్తారు. సభలో పింగళి చైతన్య, అపర్ణ తోట, మానస ఎండ్లూరి, నస్రీన్‌ఖాన్‌, కళా తాటికొండ ప్రసంగిస్తారు.