అవినీతికి పాల్పడే కాంగ్రెస్ కావాలా..?.. జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్ కావాలా..?

– తొమ్మిదిన్నరేండ్లలోనే అనేక పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్ కావాలా..?
– తనతో అభివృద్ధిలో పోటీపడాలె..
– స్వార్థం కోసం పార్టీలు మారిండు..
– బీఆర్ఎస్ పార్టీ ఆయనకు చాలా గౌరవం ఇచ్చింది..
– ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి పై బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా ఫైర్
నవతెలంగాణ  – నర్మెట 
కాంగ్రెసొళ్ళు  ఈ దేశాన్ని రాష్ట్రాన్ని 60 ఏండ్లు పాలించి స్కాంలు తప్ప చేసిందేమీ లేదు ప్రజలను నిండా ముంచింది.. ప్రతి పనిలో అవినీతికి పాల్పడే కాంగ్రెస్ కావాలా..?తొమ్మిదిన్నరేండ్లలోనే అనేక పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్ కావాలా..? మీరే ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నియోజక వర్గంలోని నర్మెట మండలం మలక్ పేట, హన్మంతపూర్, బొమ్మకూరు, వెల్డండ, అమ్మాపూర్, కన్నబోయిన గూడెం గ్రామాల్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి ఆయన ఇంటింటి ప్రచార కార్య క్రమం చేపట్టారు..ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేపట్టారు. ముందస్తుగా గ్రామాలు, తండాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు..ఈ సంద ర్భంగా జనం నుంచి అపూర్వమైన స్పందన లభించింది. అభ్యర్థి ఇంటింటికెళ్లి ఓట్లు అభ్యర్థించారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. ప్రభుత్వం చేపట్టిన ప్రగతి, సంక్షేమ కార్య క్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.జై కేసీఆర్, జై పల్లా జయహో బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించారు.ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులతో సమావేశమవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామాల్లో, కాలనీ తదితర సంఘాల నేతలతో సమావేశమై మద్దతును కూడ గట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఏ ప్రాంతాని కెళ్లినా అన్ని వర్గాల ప్రజలు ఎదురొచ్చి ఘన స్వాగతం పలుకుతున్నారు..రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటువేయాలని తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో  భాగంగా పల్లా డాన్స్ లు వేస్తూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్.ఎస్సీ కాలనీలో ఇళ్లు వచ్చినవి కానీ, కట్టుకోలేక పోయినమని చెబుతున్నారు. లేని వారందరికీ గృహలక్ష్మి కింది ఇళ్లు ఇప్పించే బాధ్యత నాది.. యాదవ, గౌడ సోదరులు కల్వర్లు, రోడ్లు కావాలని అడుగుతున్నారు. ప్రాధాన్యతా క్రమంలో నిధులు తెచ్చి వాటి సమస్యకు పరిష్కారం చూపుతా.. వాడల్లో తిరుగుతుంటే మాకు కళ్యాణలక్ష్మి వచ్చింది.. సీఎంఆర్ ఎఫ్ వచ్చింది..పింఛన్లు వచ్చినవని చాలా మంది చెబుతున్నారు. కొంత మంది రాలేదని నాతో డైరెక్ట్ గా చెబుతున్నరు. అంటే పనులు ఎవరైతే చేస్తరో నిర్మోహమాటంగా మాకు పని కావాలి సర్ అని అంటున్నరు. వారందరి సమస్యలను నోట్ చేసుకున్న.. వాటిని అన్నింటినీ పరిష్కరిస్తా..యువతకు ఏం కావాలో వాటిని గుర్తించి వారికి అన్నింటినీ తీరుస్తా.. దళిత బంధు కూడా అందరికీ వస్తయి. కాస్తా ఆలస్యమైనా దళితులందరీకీ ఇళ్లు ముందు కట్టించే బాద్యత నాదే..ఎస్సీలకు దళిత బంధు, గృహలక్ష్మి అందరికీ అందేలా చేస్తా..సేవాలాల్ భవనాలు, సీసీ రోడ్డు, తండా నుంచి తండా వరకు బీటీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు అన్నింటినీ చేయిస్తా..ఇక్కడున్న తండాల్లో అబివృద్ధి పనులకు మంత్రి సత్యవతి రాథోడ్ రూ. 13 కోట్లతో ట్రైబల్ వెల్పేర్ నిధులు ఇచ్చారు. నేను కూడా కొన్ని నిధులు ఇచ్చాను. హనుమంతా పూర్ లో మహిళా భవనానికి రూ. 25 లక్షల నిధులు ఇస్తానని మంత్రి సత్యవతిరా థోడ్ హామీ ఇచ్చారు. అలాగే తన సీడీపీ నిధులు సీసీ రోడ్లకోసం ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నిరుద్యోగులున్నా ఈ ప్రాంతాన్ని నిరుద్యోగ నిర్మూలన కోసం ఇండస్ట్రీని నెలకొల్పుతా. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను త్వరలోనే తెచ్చుకుందాం..ఫామ్ ఆయిల్ ఇండస్ట్రీ రైస్ ఇండస్ట్రీ , నిరుద్యోగ నిర్మూలన కోసం ఐటి అబ్ ను తెచ్చే ప్రయత్నం చేస్తా.నర్సింగ్ పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలను నిర్మాణం చేసుకుందాం.. ప్రజా ప్రతినిధి ప్రజలకు సేవ చేయాలి..నాయకుడంటే ఒకరికొకరు సేవ చేయడంలో పోటీ పడాలి..గతంలో బీఆర్ఎస్ లో ఉన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి తెలంగాణ రాకముందే మంచి మంచి అవకాశాలు ఇచ్చి గౌరవించిందన్నారు. ఆ తరువాత ఆయన సొంత లాభం కోసం, వ్యాపారాలను చక్కదిద్దుకునేందుకు చాలా పార్టీలు మారిండని ఆరోపించారు. ఆయన మొదట టీఆర్ఎస్, తరువాత వైసీపీ, బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ ఇలా ఊసరవెళ్లిలా పార్టీలు మారుతూనే ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఇక కొమ్మూరి నాది లోకల్ కాదంటున్నాడని, ఆయనది చేర్యాల అయితే, నాది తరిగొప్పుల పక్కన ఉన్న సోడషపల్లి జనగామ జిల్లా అన్నారు. ఇద్దరిదీ ఒకే ప్రాంతమైనప్పుడు ఆయన నన్ను స్థానికుడు కాదని ఎలా అంటాడని ప్రశ్నించారు. కొమ్మూరి అభివృద్దిలో పోటీ పడాలే తప్ప నీతిమాలిన రాజకీయం చేయొద్దని హితవు చెప్పారు. ఘట్ కేసర్ వద్ద 300 బెడ్లతో నేను నీలిమా హాస్పిటల్ ఏర్పాటు చేశానని, ఎవరికైనా ఏమైనా కావాలంటే రేషన్ కార్డు తీసుకెళ్తే అక్కడ సేవలన్నీ ఉచితంగా చేయించే బాధ్యత నాదే.
Spread the love