ఎన్నికల ప్రచారంలో భాగంగా గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్…

– ప్రజలు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలను నమ్మి ఆగంకావద్దు.
– జనగామ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాము.
– కేసీఆర్  కుడి భుజం పల్లా రాజేశ్వర్ రెడ్డి 
– జనగామ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారు.
నవతెలంగాణ – నర్మెట్ట
బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వచ్చిన తర్వాతే తండాలు, గ్రామీణ ప్రాంతాలు కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందాయి.60 ఏండ్లలో ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీ లేదు. ఆ పార్టీపై ప్రజల్లో నమ్మకం లేకే ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నది.-కాంగ్రెస్‌ పాలనలో కేవలం 200 పింఛన్‌ ఇచ్చేవారు, అది కూడా ఎవరైనా పింఛన్‌దారు చనిపోతేనే మరొకరికి వచ్చే అవకాశం ఉండేది. నేడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్‌ ఇచ్చి ఆదుకుంటున్నది. నాడు కరువు పరిస్థితులతో వేసిన పంటలు ఎండి ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, అలాగే బతుకుదెరువు కోసం అనేక మంది వలస పోయారు.కానీ నేడు ఇతర దేశాలు, ప్రాంతాల్లో స్థిరపడ్డవారు సైతం స్వగ్రామానికి వచ్చి ఆత్మగౌరవంతో తెలంగాణలో బతుకుతున్నారు. నాడు ఆడబిడ్డ పెళ్లికి ఏ ప్రభుత్వం సైతం సాయం చేయలేదు, నేడు పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రుల ఇబ్బందులు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా రూ.లక్ష ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నారు. అంతేకాకుండా రైతులు సాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రాజెక్ట్‌లు నిర్మించారని, పంట పెట్టుబడి సాయం అందిస్తూ వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్నారు.దేశం గర్వించేలా రాష్ర్టాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీకే 30 తేదీన ఓటు వేయాలి.బీఆర్‌ఎస్‌ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గారు ఆదరిస్తే మరిచిపోలేనంత అభివృద్ధిని చేసి చూపిస్తారు. మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారు. 11 సార్లు అవకాశం ఇస్తే ఎం అభివృద్ధి చేశారో చెప్పాలి. మళ్ళీ కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే నష్టపోతం తప్ప లాభం ఉండదు. -కాంగ్రెస్‌కు ఓటేస్తే కర్ణాటక రాష్ట్రం మాదిరిగా తెలంగాణ కూడా అంధకారంగా మారుతుంది. కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దు.ప్రజల అభ్యున్నతికి అండగా ఉండే బీఆర్‌ఎస్‌ పార్టీకే మద్దతుగా ఉండి రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి. బీజేపీ పాపం పెరిగినట్టే గ్యాస్ ధర పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడబిడ్డలకు 400 కే గ్యాస్ ఇస్తున్నారు.రేవంత్ రెడ్డి ఒక 420…అవకాశం కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్,  ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి.గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్, పోడు భూములకు పట్టాలు, అనేక గిరిజన గురుకులాలూ  ఇచ్చిన ఘనత  సిఎం కెసిఆర్ గారికే దక్కుతుంది.ప్రతి తండాకు రోడ్లు వేసుకున్నాము. గిరిజన గుడాలకు, తండాలకు 300 కోట్లతో  3 పేజ్ కరెంట్ ఏర్పాటు చేశారు. గిరిజనులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్  అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి..
Spread the love