కలం విదిల్చడమే కాదు జూలు విదిల్చండి

నవతెలంగాణ – కంటేశ్వర్
సమాజహితం కోసం కలాన్ని విదిల్చడమే కాకుండా జూలు కూడా విదిల్చాలని రచయితలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సమాజహితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు. సున్నితత్వాన్ని, మానవత్వాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న అంశాలను తరిమికొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బుధవారం రోజున నిజామాబాద్ లో జరిగిన హరిద రచయితల సంఘం 5వ మహాసభలో కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు.దాశరధి, వట్టికోట అళ్వారుస్వామిని నిజాం కాలంలో ఇందూరు జైలులో బంధించారని, ఆ జైలు గోడ మీద దాశరధి బొగ్గుతో రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న మాట యావత్తు తెలంగాణ ఉద్యమానికి బాట చూపించిందని స్పష్టం చేశారు. ఆ జైలు గోడను తన ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ. 40 లక్షలు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. జూలై 22న దాశరధి జయంతి సందర్భంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పటు చేస్తున్నామని తెలిపారు. కొత్త తరానికి దాని ప్రాముఖ్యత తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఢిల్లీ నగర నడిబొడ్డున ఒక ఆడపిల్లను కత్తిపోట్లు పొడిచి బండరాయితో తలపై మోది చంపేస్తే కూడా చుట్టూ ఉన్నవాళ్లు వీడియోను చిత్రీకరించారుకానీ ఎవరూ ఆపిన పాపానపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఎటు నుంచి ఎటు పయనిస్తున్నామన్నది ఆలోచించుకోవాలన్నారు. దరిద్రపు సెల్ ఫోన్ అనేది చేతికి, మనిషికి ఎక్స్ టెన్షన్ లా తయారయ్యి సున్నితత్వంలేని విధంగా మనుషులు ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. “ఇవాళ రకరకాల అంశాల ఇంటిదాక వస్తున్నాయి. మన నోటును కొల్లగొట్టడానికి, మన ఓటును కొల్లగొట్టడానికి వస్తున్న అంశాలు సరే. కానీ మన సున్నితత్వాన్ని, మన మానవత్వాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న అంశాలను తప్పకుండా తరిమికొట్టాలి” అని కవిత పిలుపునిచ్చారు.ఒక పుస్తకాన్ని చదువుతుంటే జీవితాన్ని మనది మనం అనుభవిస్తున్నట్టుంటుందని అభిప్రాయపడ్డారు. కానీ సినిమాలు అలా ఉండవని, చాలా తక్కువ సినిమాలు ఆలోచింపజేసేలా ఉంటాయని చెప్పారు. లుక్ కల్చరా లేదా బుక్ కల్చరా అంటే… తనదైతే బుక్ కల్చరేనని స్పష్టం చేశారు. పుస్తక సంస్కృతిలోకి మనం పిల్లలను లాగకపోతే ఘోరాన్ని చూసి స్పందించే గుణాన్ని కోల్పోయామో అలా భవిష్యత్తులో ఇంకా దారుణాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ప్రపంచీకరణ జరిగిన తర్వాత మన ఫోన్లకు రకరకాల జాఢ్యాలు వచ్చాయని, అవి పెరిగి పెచ్చరిల్లుతున్నాయని, వాటికి అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అది సాహిత్యంతోనే జరుగుతుందన్న విశ్వాసం తనకు ఉందని, మనిషి, సమాజపు ఆలోచనను మార్చే శక్తి ఒక చిన్న సిర చుక్కకు ఉందని వ్యాఖ్యానించారు. సమాజహితం కోసం పనిచేసే సాహిత్యం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హిందీ భాషలో రాసే కవులను కూడా కూడగట్టి భారతదేశంలో వస్తున్న నిర్లిప్తత ఏంటి ? సంస్కృతి ఏంటి ? అన్న అంశాలపై రాయాలని ప్రోత్సహిస్తున్నామని వివరించారు.కలం విధిల్చడమే కాదు జూలు విధిల్చాలని రచయితలకు పిలుపునిచ్చారు. 2009లో ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకుంటే పార్టీలు లేవు… ఏమీ లేవు అని అన్న సీఎం కేసీఆర్ అప్పటి మంత్రి జానా రెడ్డికి వెళ్లి ప్రొఫెసర్ కోదండరాంను పిలిపించి జేఏసీ ఏర్పాటు చేయించారని, పార్టీలు కాదు మనకు తెలంగాణ కావాలని చెప్పిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. అది తెలంగాణ గురించి అయినా, మన దేశం గురించి అయినా రాజకీయం ఏమీ లేదని, ప్రజల బాగోగుల గురించి మాత్రమే ఆలోచన అని తెలిపారు.నిజామాబాద్ జిల్లాలో అద్భుతమైన సాహితీవేత్తలు ఉన్నారని తెలిపారు. తరతరలా నుంచి ఉన్న ఈ అద్భుతమైన సాహిత్య సంపదను కొనసాగించాలని ఆకాంక్షించారు.హరిద రచయితల సంఘం కార్యకలాపాలు సాగించడానికి ఒక నిర్ధిష్టమైన స్థలం అవసరమని, అందుకు వేదికను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా హరిద కార్యకలాపాలు విస్తరించాలని అన్నారు.

Spread the love
Latest updates news (2024-07-08 16:55):

will apple increase QhM blood sugar | does kqq pears increase blood sugar | are you diabetic OOM if your blood sugar is low | what is the high zP7 blood sugar level | 3AC cant get blood sugar under 300 | type two diabetes 143 lul blood sugar levels | does glipizide help lower blood fuk sugar | guitar music for blood mR3 sugar sex magic | when to test blood y28 sugar if uncontrolled | blood sugar meter accuracy REv test solution accuracy | blood sugar 99 HeG after eating | 4I0 can black coffee affect blood sugar | cinnamon capsules lower blood sugar fNi | high blood v90 sugar readings | semaglutide causing low OtP blood sugar | loww blood iST sugar chart | does valtrex cause lower aoH blood sugar | lRo what happens to sugar as it enters the blood stream | g0I high blood sugar pregnancy symptoms | type rbc 1 diabetes correct low blood sugar ketosis | 1 hour after eating blood L2z sugar level gestational diabetes | blood cbd cream sugar weed | what happens with dangerously JNU high blood sugar | can you use 7lW blood sugar tester with keto strips | how QcD to bring down elevated blood suger in a diabetic | blood sugar average 100 is zh2 what a1c | does having a cold affect BHh fasting blood sugar | blood sugar measurement device v0v in india | foods that don CX3 spike your blood sugar | target blood sugar levels during pregnancy nht | blood sugar 149 3 hours after eating Mi0 | blood sugar level 337 after xJk meal | pill you can wsi use to lower blood sugar | losartan blood J4g sugar test | list of blood sugar stabilizing foods byf | 142 blood sugar level eM1 lightheaded | is 98 consicered low blood sugar Wva levels | low blood sugar 9fU symptoms in women | 3yg how to manage your blood sugar levels | how to reduce blood Pxw sugar quickly when it spikes | best diet HUF for low blood sugar | gabapentin cause high swQ blood sugar | aD8 normal average blood sugar level | low blood uiH sugar but overweight | what is cRr a prediabetes blood sugar level | why my blood sugar is high in cAL the morning symptoms | how 6Pl much should blood sugar spike after eating | rfC fasting blood sugar of 156 | when should a diabetic test their sEt blood sugar | how to safely raise blood 68T sugar